Medicine Price: హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహంతో బాధపడేవారు ఉపయోగించే 41 అవసరమైన మందులు, 6 ఫార్ములేషన్స్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) నోటిఫికేషన్ ప్రకారం గుండె జబ్బులు, మధుమేహం, దీర్ఘకాలిక నొప్పులు, హృదయ సంబంధ వ్యాధులు, కాలేయ సమస్యలు, యాంటాసిడ్లు, ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, మల్టీవిటమిన్లు, యాంటీబయాటిక్‌ల మందుల ధరలు తగ్గాయి. “ప్రజలకు మేలు జరిగేలా మందుల ధరలను తగ్గించారు. ధర తగ్గింపు అనేది ఒక సాధారణ ప్రక్రియ, అథారిటీ దానిని అనుసరించింది.” అని సీనియర్ ఎన్‌పిపిఎ అధికారి ఒకరు తెలిపారు.
పూర్తిగా చదవండి..Medicine Price: షుగర్.. హార్ట్ డిసీజ్ పేషేంట్స్ కు గుడ్ న్యూస్.. ఆ మందుల ధరలు తగ్గాయి..
షుగర్ పేషేంట్స్ కు గుడ్ న్యూస్ ఇది. కేంద్ర ప్రభుత్వం డయాబెటిక్ మందులపై ధరలను తగ్గించింది. గుండె జబ్బులు, మధుమేహం, దీర్ఘకాలిక నొప్పులు, హృదయ సంబంధ వ్యాధుల తో పాటు మరిన్ని అత్యవసర మందుల ధరలను తగ్గించినట్టు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) తెలిపింది.
Translate this News: