New Virus: భయపెడుతున్న కొత్త వైరస్ డింగా డింగా..అసలేంటిది?
ఒక కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఉగాండాలో వ్యాపిస్తున్న ఈ కొత్త వైరస్ డింగా డింగా ప్రపంచాన్ని వణికించడానికి రెడీ అయింది. శరీరంలో అస్సలు శక్తి లేకుండా ఊగిపోవడమే దీని లక్షణం.
ఒక కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఉగాండాలో వ్యాపిస్తున్న ఈ కొత్త వైరస్ డింగా డింగా ప్రపంచాన్ని వణికించడానికి రెడీ అయింది. శరీరంలో అస్సలు శక్తి లేకుండా ఊగిపోవడమే దీని లక్షణం.
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయడిన శ్రీ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు కిమ్స్ వైద్యులు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని.. ఫీడింగ్ తీసుకోగలుగుతున్నాడని తెలిపారు. బాలుడి ఆరోగ్యంపై కొద్దిసేపటి క్రితం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
గురువారం పార్లమెంటులో జరిగిన కొట్లాటలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై కేసు నమోదు అయింది. రాహుల్ తోసేయడం వల్లనే బీజేపీ ఎంపీ గాయపడ్డారని పార్లమెంట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు దాన్ని తాజాగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.
సంధ్యా థియేటర్ వివాదంలో అల్లు అర్జున్‌కు షాక్‌ల మీద షాక్‌లు తుగులుతూనే ఉన్నాయి. తాజాగా దీనిపై హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేశారు. ప్రచారం మోజులో పడి ప్రాణాలు తీశారని ఫిర్యాదుదారు కంప్లైంట్ చేశారు.
జమిలీ ఎన్నికల పై అధ్యయనానికి ఏర్పాటైన జేపీసీకి ఛైర్మన్‌గా బీజేపీ ఎంపీ పీపీ చౌదరిని నియమించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేసింది.
బయట వివాదాలు ఎలా ఉన్నా పుష్ప–2 సినిమా మాత్రం తన హవాను కొనసాగిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్లో తన ప్రతాపం చూపిస్తోంది. ఇప్పటి వరకు హిందీ సినీ చరిత్రలో ఏ సినిమా కలెక్ట్ చేయని విధంగా కేవలం 15 రోజుల్లోనే 632 కోట్ల 50 లక్షలు సాధించిన రికార్డ్ సృష్టించింది.
11మంది చనిపోయారు...30 వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి..ఈరోజు ఉదయం జైపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం బీభత్సం సృష్టించింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజి ఇప్పుడు వైరల్ అవుతోంది. ముందు గ్యాస్ లీక్ అయి తరువాత మంటలు అంటుకున్నట్టు దీనిలో తెలుస్తోంది.
పేరులో ఒకటి..లోపల ఇంకొకటి..యూట్యూబ్‌లో ఇది చాలా సర్వసాధారణం. అయితే ఇక మీదట ఇలాంటి ఆటలు చెల్లవు అంటోంది యూట్యూబ్. తప్పుదోవ పట్టించే థంబ్ నెయిల్స్ పెట్టేవారికి ఇక కాలం చెల్లింది అంటూ కొత్త నిబంధనలను తీసుకువస్తోంది.