Salt: ఆహారంలో ఉప్పు ఎక్కువైతే కిడ్నీల సమస్య వస్తుందా..?

ఆహారంలో ఉప్పు ఎక్కువైతే బీపీతో పాటు గుండెజబ్బులు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఉప్పు అధికంగా వాడే వారు కిడ్నీ వ్యాధి బారిన పడే అవకాశాలున్నాయి. వ్యాయామంతో కిడ్నీ వ్యాధిని తగ్గించుకోవచ్చు.

Salt: ఆహారంలో ఉప్పు ఎక్కువైతే కిడ్నీల సమస్య వస్తుందా..?
New Update

Salt: ఆహారం రుచిని పెంచడంలో ఉప్పుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆహారంలో ఉప్పు ఎక్కువ అయితే బీపీతో పాటు గుండెజబ్బులు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇప్పటికే అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే.. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి దారితీస్తుందని ఒక అధ్యయనం వెల్లడించింది. 4,65,288 మంది ఆరోగ్య సమాచారాన్ని సేకరించి ఈ అధ్యయనం నిర్వహించారు. ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడే వారు కిడ్నీ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. ముప్పై నుంచి 70 ఏళ్లలోపు వారితో చేసిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎక్కువగా ఉప్పు వాడేవాళ్లు, అప్పుడప్పుడు తీసుకునేవారిపై పరిశోధన జరిపారు.

రక్తపోటు పెరుగుతుంది:

అధిక మొత్తంలో ఉప్పును తీసుకునే వారిలో బీఎంఐ ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. తక్కువ BMI ఉన్నవారికి, ఎక్కువగా వ్యాయామం చేసేవాళ్లకు కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ఒక వ్యక్తి రోజుకు వినియోగించాల్సిన ఉప్పు మొత్తం ఐదు గ్రాముల కంటే తక్కువ. కానీ చాలా మంది ప్రజలు తమ ఆహారంలో 10.8 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇలా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుందని, గుండెపోటు, స్ట్రోక్ సమస్యలు వస్తాయని అంటున్నారు. ఉప్పు తక్కువగా తింటే పక్షవాతం, క్యాన్సర్ తదితర వ్యాధులను అరికట్టవచ్చని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది.

కడుపు ఉబ్బరం:

  • ఎక్కువగా ఉప్పు తీసుకోవడంతో కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అదనపు ఉప్పు శరీరంలో నీటి నిలుపుదలని పెంచుతుంది.

అధిక రక్త పోటు:

  • శరీరంలో అధిక రక్తపోటు స్థాయికి అనేక కారణాలు ఉండవచ్చు. అధిక ఉప్పు కూడా రక్తపోటు స్థాయిలలో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది.

    మూత్రపిండాల పనితీరును కూడా దెబ్బతీస్తుంది.

మరింత దాహం:

  • మీకు సాధారణం కంటే ఎక్కువ దాహం అనిపిస్తే, ఉప్పు కూడా కారణం కావచ్చు.

బరువు పెరగడం:

  • ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిలిచిపోయి బరువు పెరుగుతారు. మీరు కొన్ని రోజులు లేదా వారాలలో బరువు పెరిగినట్లు మీకు అనిపిస్తే దాని వెనుక ఉప్పు కారణమై ఉండొచ్చని అంటున్నారు.

ఇది కూడా చదవండి: ఫొటోలు తీస్తుంటే పొట్ట వెనక్కి లాగుతున్నారా..? జాగ్రత్త

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #health-problems #kidney-problems #food #salt
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe