ఏపీలో సబ్సీడీపై కిలో రూ.50కే టమాటాలు.. బారులు తీరిన జనం.. కట్ చేస్తే!!

ప్రస్తుతం విజయవాడలోని అన్ని ప్రధాన రైతు మార్కెట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. సబ్సీడీపై ఒక మనిషికి రెండు కిలోల టమాటాలు మాత్రమే ఇస్తున్నారు. ఆ టమాటాల కోసం పనులన్నీ మానేసుకుని మార్కెట్లలో పడిగాపులు కాస్తున్నారు పబ్లిక్. ఒకప్పుడు రేషన్ షాపు ముందు, నీళ్ల కోసం ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నామో.. అదే ఇప్పుడు టమాటాలకు కూడా ఎదురయ్యిందని జనం మాట్లాడుకుంటున్నారు. తీరా గంటల తరబడి క్యూ లైన్ లలో వేచి ఉండి తీసుకున్న టమాటాలు..

New Update
ఏపీలో సబ్సీడీపై కిలో రూ.50కే టమాటాలు.. బారులు తీరిన జనం.. కట్ చేస్తే!!

టమాటా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కూరకే రుచిని పెంచేది టమాటా. ఒక్క కాయ వేసినా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అలాంటిది పెరిగిన టమాటా ధరలతో వాటని వాడాలంటేనే జనం భయపడిపోతున్నారు. సగానికి సగం మంది అయితే అసలు టమాటాలను కొనడమే మానేశారు. పెరిగిన టమాటా ధరలతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు ప్రజలు. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటాల ధర రూ.150 నుంచి 250 వరకూ పలుకుతుంది.

ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సబ్సీడీపై టమాటాలను అందిస్తోంది. కేవలం కిలో రూ.50కే ప్రజలకు అందిస్తుంది. అయితే ఈ సబ్సీడీ టమాటా కష్టాలు కూడా మామూలుగా లేవు. గత వారం రోజులుగా విజయవాడలో సబ్సీడీ టమాటాలు రాక జనం అల్లాడిపోయారు. తాజాగా బుధవారం మార్కెట్ కు సబ్సీడీ టమాటాలు రావడంతో అన్ని మార్కెట్లలో కిలో మీటర్ల మేర జనం క్యూ కట్టారు. ఉదయం 7 గంటలకే క్యూ లైన్లలో టమాటాను కోసం వేచి ఉన్నారు.

ప్రస్తుతం విజయవాడలోని అన్ని ప్రధాన రైతు మార్కెట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. సబ్సీడీపై ఒక మనిషికి రెండు కిలోల టమాటాలు మాత్రమే ఇస్తున్నారు. ఆ టమాటాల కోసం పనులన్నీ మానేసుకుని మార్కెట్లలో పడిగాపులు కాస్తున్నారు పబ్లిక్. ఒకప్పుడు రేషన్ షాపు ముందు, నీళ్ల కోసం ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నామో.. అదే ఇప్పుడు టమాటాలకు కూడా ఎదురయ్యిందని జనం మాట్లాడుకుంటున్నారు. తీరా గంటల తరబడి క్యూ లైన్ లలో వేచి ఉండి తీసుకున్న టమాటాలు.. తీరా ఇంటికి వెళ్లి చూస్తే.. నాసిరకం, కుళ్లిన టమాటాలు ఉంటున్నాయని వాపోతున్నారు. ఈ ధరకు బయట మార్కెట్ లో మంచి టమాటాలే వస్తాయి కదా అని అనుకుంటున్నారు.

కాగా వారానికి ముందు విజయవాడ రైతు మార్కెట్ లో కేటీ టమాటా ధర 150-200 రూపాయలు ఉండేవి. అయితే నిన్నటికి ఇవాళ్టికి కాస్త టమాటాల ధర దిగి వచ్చాయని అంటున్నారు జనం. ఇక చాలా మార్కెట్లలో అయితే గడిచిన వారం రోజులుగా టమాటాలు కనిపించనే లేదు. పెరిగిన రేట్లతో రైతు బజార్ బోర్డు ధర గిట్టుబాట కాక వ్యాపారులు టమాటాలను బైకాట్ చేశారు. మరోవైపు రిటైల్ మార్కెట్ లో మిగిలిని కూరగాయలు కొంటేనే టమాటాలు అమ్ముతామని వ్యాపారులు రూల్ కూడా పెడుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు