Vegetables: మరోసారి కూరగాయల ధరలకు రెక్కలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అసలే ధరలు పెరిగి మధ్య తరగతి వారు ఏది కొనలేని పరిస్థితుల్లో ఉంటే..ఇప్పుడు కూరగాయలు కూడా మరో భారంగా తయారయ్యాయి. తెలంగాణ హైదరాబాద్ నగరంలో టమాటా, ఉల్లి ధరలు మళ్లీ చుక్కలను తాకుతున్నాయి.
వంటకు ప్రధానమైన టమాటా, ఉల్లి ధరలు పెరగడంతో.. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గత వారం రోజుల నుంచి ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. టమాటా ఉన్నట్టుండి నిన్నటి నుంచి భారీ ధర పలుకుతోంది.నాణ్యమైన మొదటి రకం టమాటా కిలో రూ. 80 నుంచి రూ. 90 పలుకుతోంది. సెకండ్ క్వాలిటీ టమాటా కిలో ధర రూ. 60 నుంచి 70 గా ఉంది.
ఇక హోల్ సేల్ మార్కెట్లలో రూ. 120కి మూడు కిలోల టమామా విక్రయిస్తున్నారు. ఇక కేజీ ఉల్లిపాయ ధర రూ. 50పైనే పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో రూ. 60కి విక్రయిస్తున్నారు. టమాటా, ఉల్లిపాయ ధరలు పెరగడంతో సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే బెంబెలెత్తిపోతున్నారు.