కత్రినా కైఫ్‌ కి 5 కోట్ల అప్పు ఎగ్గొట్టిన తెలుగు హీరో!

టాలీవుడ్‌ కి చెందిన ఓ స్టార్ హీరో బాలీవుడ్ భామ కత్రినా కైఫ్‌ దగ్గర రూ. 5 కోట్ల అప్పుతీసుకుని ఎగ్గొటారనే వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

కత్రినా కైఫ్‌ కి 5 కోట్ల అప్పు ఎగ్గొట్టిన తెలుగు హీరో!
New Update

పొడుగు కాళ్ల సుందరి కత్రినా కైఫ్‌ గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ..ఇక్కడ ఆమెకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. కత్రినా తన మిత్రుడు, నటుడు విక్కీ ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. తాజాగా ఆమె గురించి ఓ వార్త నెట్టింట తెగ షికారు చేస్తుంది.

కత్రినా తెలుగు సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఓ స్టార్‌ హీరో ఆమె దగ్గర ఐదు కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టేశాడంట. ఇంతకీ ఆ హీరో ఎవరు..ఆయన ఆమెకి ఎందుకు డబ్బులు కట్టడం లేదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కత్రినా తెలుగులో చేసింది వెంకటేష్‌, బాలకృష్ణలతోనే అయినప్పటికీ ఆమె తెలుగు హీరోలలో కొందరితో చాలా స్నేహంగా ఉండేది.

ఆ సమయంలోనే ఓ స్టార్‌ హీరో నిర్మాతగా మారి సినిమా తీయాలనుకుంటున్నట్లు ఆమె తో చెప్పడంతో పాటు 5 కోట్ల రూపాయలను అప్పుగా కూడా ఆమె దగ్గర తీసుకున్నాడు. కానీ సినిమా తీసిన తరువాత అది ప్లాప్‌ కావడంతో ఆ హీరో కత్రినాకి ఇవ్వాల్సిన డబ్బులు గురించి ఏం మాట్లాడలేదు.

అంతేకాకుండా రెండు మూడు సార్లు కత్రినా ఆ వ్యక్తిని డబ్బులు గురించి అడిగితే అసలు నువ్వు నాకు ఎప్పుడూ డబ్బు ఇచ్చావని ఎదురు తిరిగాడంట.దీంతో కత్రినా ఇక మీదట ఎవర్ని నమ్మకూడదని డిసైడ్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్‌ గా మారింది.

Also read: డబ్బు కోసం నటించాలంటే భయంగా ఉంది..బాలీవుడ్‌ ముద్దుగుమ్మ!

#tollywood #bollywood #katrina-kaif
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe