/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/dharam.jpg)
Sai Daram Tej Went Tirumala : ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డియే కూటమి ఏకంగా 164 సీట్లు సాధించి తిరుగులేని విజయం సాధించింది. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Pawan Kalyan) తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో, అత్యధిక మెజారిటీతో విజయం సాధించి ప్రస్తుత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసారు.
Also Read : ప్రధాని మోదీ జీ-7 దేశాల అధినేతల్లో ప్రత్యేకమైన నాయకుడు.. ఎందుకంటే..
పిఠాపురం(Pithapuram)లో పవన్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ అంతా కూడా ఎంతో సపోర్ట్ గా నిలిచింది. మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్(Sai Daram Tej), వైష్ణవ తేజ్ పిఠాపురంలో ప్రచారం కూడా చేసారు. అలాగే ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు కూడా పవన్ కల్యాణ్ కి తమ మద్దతు ప్రకటించారు. వీరందరి మద్దతుతో పవన్ అద్భుత విజయం సాధించాడు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ గెలిస్తే కాలినడకన తిరుమల వస్తానని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మొక్కుకున్నాడు. తాజాగా ఆ మొక్కును తీర్చుకోవడం కోసం కాలినడకన తిరుమలకు వెళ్లారు.