Hero Raviteja: మల్టీ ప్లెక్స్ బిజినెస్ లోకి రవితేజ.. థియేటర్ పేరు ఏంటో తెలుసా ..?

స్టార్ హీరో రవితేజ థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ న్యూస్ వైరలవుతుంది. ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి దిల్‌సుఖ్‌నగర్‌లో సిక్స్ స్క్రీన్స్ తో భారీ మల్టీప్లెక్స్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ థియేటర్ కు ART అనే పేరు పెట్టబోతున్నట్లు తెలిసింది.

Hero Raviteja: మల్టీ ప్లెక్స్ బిజినెస్ లోకి రవితేజ.. థియేటర్ పేరు ఏంటో తెలుసా ..?
New Update

Ravi Teja Into Multiplex Business: ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ యాక్టింగ్ కెరీర్ తో పాటు బిజినెస్ రంగంలో కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే థియేటర్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబు (Mahesh Babu), విజయ్ దేవరకొండ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. గచ్చిబౌలిలో AMB పేరుతో మహేష్ బాబు, అమీర్ పేట్ లో AAA పేరుతో అల్లు అర్జున్, మహబూబ్ నగర్ లో AVD పేరుతో విజయ్ దేవకొండ మల్టీఫ్లెక్స్‌ థియేటర్లను నిర్మించారు. ఈ స్టార్ హీరోలంతా ఏషియన్ సినిమాస్ (Asian Cinemas) భాగస్వామ్యంతో థియేటర్ బిజినెస్ ప్రారంభించారు.

Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్ 

publive-image

థియేటర్ బిజినెస్ లోకి రవితేజ ఎంట్రీ

ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా ఇదే బాటలో అడుగులు వేయబోతున్నారు. మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ కూడా ఏషియ‌న్ సినిమా సంస్థతో కలిసి హైదరాబాద్ లో మల్టీ ప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్‌లో సిక్స్ స్క్రీన్స్ తో భారీ మల్టీ ప్లెక్స్ ను ప్రారంభించనున్నారు. త్వరలోనే ఓపెనింగ్ చేయబోతున్నట్లు సమాచారం. థియేటర్ కు ART అనే పేరు పెట్టబోతున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు కేవలం సినిమాల్లో నటిస్తూ మాత్రమే ఆదాయాన్ని సంపాదించిన రవితేజ.. ఇప్పుడు థియేటర్ బిజినెస్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

Also Read: Director Yashasvi: ‘నాలా ఇంకెవరూ మోసపోవద్దు’.. మ్యూజిక్ డైరెక్టర్ రధన్‍ పై వైరలవుతున్న యశస్వి కామెంట్స్

#ravi-teja #tollywood #asian-cinemas
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe