Double ISMART: డబుల్ ఇస్మార్ట్ మాస్ బీట్ 'స్టెప్పమార్'.. దుమ్మురేపిన రామ్..!

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో హీరో రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డబల్ ఇస్మార్ట్'. తాజాగా మూవీ ఫస్ట్ సింగల్ 'స్టెప్పా మార్' మాస్ బీట్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ సాంగ్ జులై 1న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Double ISMART: డబుల్ ఇస్మార్ట్ మాస్ బీట్ 'స్టెప్పమార్'..  దుమ్మురేపిన రామ్..!
New Update

Steppamaar Song Promo: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్ (Double ISMART). పక్కా మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వం వహిస్తున్నారు. యంగ్ బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించగా.. సంజయ్ దత్, బన్ని జె, అలీ, గెటప్ శ్రీను, సాయాజీ షిండే, మకరంద్ దేశ్‌పాండే, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే విడుదలైన మూవీ టీజట్ సూపర్ రెస్పాన్స్ సొంత చేసుకోగా.. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

స్టెప్పమార్ సాంగ్ రిలీజ్

తాజాగా మూవీ ఫస్ట్ సింగల్ 'స్టెప్పా మార్' మాస్ బీట్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. పాటలో మాస్ స్టెప్స్ తో రామ్ దుమ్ములేపుతున్నారు. ఫుల్ ఫుల్ సాంగ్ జులై 1న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఈ మూవీ టైటిల్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను షూట్ చేస్తున్నారు. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.

Also Read: Kalki 2898 AD: యూట్యూబ్ లో కల్కి 'టా టక్కర' ఫుల్ వీడియో సాంగ్ ... ప్రభాస్, దిశా పటాని అదరగొట్టేశారు ..! - Rtvlive.com

#steppamaar-song #ram-pothineni #double-ismart-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe