Kalki 2898 AD: యూట్యూబ్ లో కల్కి 'టా టక్కర' ఫుల్ వీడియో సాంగ్ ... ప్రభాస్, దిశా పటాని అదరగొట్టేశారు ..! ప్రభాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ కల్కి 2898AD ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. తొలిరోజు నుంచే రికార్డు వసూళ్లను రాబడుతోంది. తాజాగా కల్కి మూవీలోని 'టా టక్కర' ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. By Archana 29 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కల్కి 2898AD. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా విడులైంది. రిలీజ్ కు విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. రిలీజ్ తర్వాత కూడా అదే క్రేజ్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. విడుదలైన తొలిరోజు నుంచి రికార్డు వసూళ్లను రాబడుతోంది. తొలి రోజు వరల్డ్ వైడ్ రూ.190 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్ సీస్ లో కూడా రికార్డు వసూళ్లతో ర్యాంపేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. నార్త్ అమెరికాలో ‘కల్కి’ ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ఫస్ట్ డే ప్రీమియర్స్ లో 3.8 మిలియన్ డాలర్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో 'టా టక్కర్' ఫుల్ వీడియో సాంగ్ ఇది ఇలా ఉంటే తాజాగా ఫ్యాన్స్ కు మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కల్కిలోనే 'టా టక్కర్' ఫుల్ వీడియో సాంగ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ప్రభాస్ , దిశా పటాని కాంప్లెక్ ఎక్స్ పీరియన్స్ నేపథ్యంలో ఈ సాంగ్ ఉంటుంది. సినిమా చూడనివారు ఇప్పుడు యూట్యూబ్ లో ఈ సాంగ్ చూడవచ్చు. Also Read: Kalki 2898 AD: ‘కల్కి’కి జాక్ పాట్.. ఓటీటీ రైట్స్ కోసం రెండు దిగ్గజ ప్లాట్ ఫార్మ్స్ బరిలో …! #ta-takkara-full-song #kalki-2898-ad-movie #prabhas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి