/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/puri-jpg.webp)
Akash Puri Love Marriage : ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో(Film Industry) కూడా యువ హీరోలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ ఏడాదిలో మెగా కంపౌడ్ లో పెళ్లి బజాలు మోగగా..శర్వానంద్ పెళ్లి చేసుకోవడమే కాకుండా తండ్రి కూడా కాబోతున్నాడు. తాజాగా మరో యంగ్ హీరో కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం.
అతను మరెవరో కాదు..ఆకాష్ పూరీ(Aakash Puri) ..డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri Jagannadh) కుమారుడు ఆకాష్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆకాష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తరువాత చాలా సినిమాల్లో నటించి అందరినీ మెప్పించాడు. ఆ తరువాత యంగ్ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆకాష్ ప్రేమ పెళ్లి చేసుకుంటున్నట్లు సమాచారం. అమ్మాయి ఓ రాజకీయ నాయకుని మనవరాలని ఇండస్ట్రీలో టాక్. వీరి పెళ్లికి ఇరు వర్గాల వారు ఒప్పుకున్నారని తెలుస్తుంది.
అతి త్వరలోనే వీరి నిశ్చితార్థం కూడా జరగనున్నట్లు ఈ విషయం గురించి త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయం గురించి పూర్తి క్లారిటీ రావాలంటే..పూరీ కుటుంబ సభ్యులు ఎవరోకరు స్పందించాల్సి ఉంది. పూరీ చేసుకోబోయే అమ్మాయి కొన్ని కోట్లకు వారసురాలని సమాచారం.
ఇండస్ట్రీలో కొంతకాలం ముందు వరకు కూడా స్టార్ డైరెక్టర్ గా వెలిగాడు పూరీ జగన్నాథ్. ఆయన రవితేజ, మహేష్ బాబు, పవన్ లాంటి స్టార్స్ తో సూపర్ హిట్ సినిమాలు చేశాడు పూరీ. గత కొంతకాలంగా ఫెయిల్యూర్స్ తో కాలం వెల్లదీస్తున్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్.. తనకు సెకండ్ ఇన్నింగ్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు. డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో ఈమూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందీ సినిమా.
Also read: ఏలూరులో నమోదైన కరోనా కేసు..ఇప్పటి వరకు ఏపీలో ఎన్ని కేసులంటే!