NKR21: వైజ‌యంతి ఐపీఎస్.. ‘NKR21’లో విజయశాంతి ఫస్ట్ లుక్..!

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'NKR21'. తాజాగా మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఆమె ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. సినిమాలో విజయశాంతి ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.

New Update
NKR21:  వైజ‌యంతి ఐపీఎస్..  ‘NKR21’లో విజయశాంతి ఫస్ట్ లుక్..!

Vijayashanthi Birthday Glimpse: ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) నటిస్తున్న తాజా చిత్రం ‘NKR21’. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్‌ బ్యానర్ పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి, సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

విజయశాంతి బర్త్ డే గ్లింప్స్

అయితే తాజాగా సినిమా నుంచి మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు నటి విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ చేశారు మేకర్స్. సినిమాలో విజయశాంతి ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 'వైజ‌యంతి ఐపీఎస్. తాను ప‌ట్టుకుంటే పోలీస్ తుపాకికి ధైర్యం వస్తుంది' అంటూ గ్లింప్స్ లో చూపించిన డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. బింబిసారా, డెవిల్ లాంటి సూపర్ హిట్స్ కళ్యాణ్ రామ్ నుంచి రాబోతున్న ఈ మూవీ ప్రేక్షకులలో అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Darling : ది మ్యాడ్‌మాక్స్ మ్యారేజ్ ఎంటర్‌టైనర్.. డార్లింగ్ రిలీజ్ ఆరోజే..? - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు