Darling : ది మ్యాడ్‌మాక్స్ మ్యారేజ్ ఎంటర్‌టైనర్.. డార్లింగ్ రిలీజ్ ఆరోజే..?

టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, న‌భా న‌టేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ డార్లింగ్. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ పై అశ్విన్ రామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. జులై 19న డార్లింగ్ విడుద‌ల కానున్నట్లు తెలిపారు.

New Update
Darling : ది మ్యాడ్‌మాక్స్ మ్యారేజ్ ఎంటర్‌టైనర్.. డార్లింగ్ రిలీజ్ ఆరోజే..?

Darling Release :  ప్రియదర్శి (Priyadarshi), న‌భా న‌టేష్‌ (Nabha Natesh) జంటగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'డార్లింగ్' (Darling). పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనన్య నాగళ్ళ మొయిన్, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్, కళ్యాణి రాజ్, సునీత మనోహర్, ముళ్లపూడి రాజేశ్వరి, అభిజ్ఞ, జీవన్, కృష్ణ తేజ, విష్ణు, సంజయ్ స్వరూప్, రఘుబాబు, ప్రియాంక, స్వప్నిక, శివరంజని తదితరులు కీలక పాత్రలు పోషించారు.

డార్లింగ్ రిలీజ్ డేట్

ఇప్పటికే విడుదలైన మూవీ గ్లిమ్ప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ది మ్యాడ్‌మాక్స్ మ్యారేజ్ ఎంటర్‌టైనర్ డార్లింగ్ జులై 19 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ . పెళ్లి తర్వాత భార్య చేతిలో కీలు బొమ్మ‌గా మారిన భ‌ర్త పరిస్థితి ఏంటి..? అనే నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Brahmamudi: అంతా నాటకమే.. సుభాష్ పెద్ద షాకిచ్చిన అపర్ణ..! కళ్యాణ్ ను బయటకు గెంటేసిన కనకం..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు