Samantha : ఆ డైరెక్టర్ తో సమంత డేటింగ్..?

టాలీవుడ్ నటి సమంత 'ఫ్యామిలీ మాన్' డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వైరలవుతున్నాయి. కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్ నిడిమోరు డైరెక్షన్ లో సమంత సిటాడెల్, ఫ్యామిలీ మాన్ వంటి వెబ్ సీరిస్ లలో నటించింది.

New Update
Samantha : ఆ డైరెక్టర్ తో సమంత డేటింగ్..?

Samantha Dating :  2017 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న నటి సమంత (Samantha), అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) వైవాహిక జీవితం నాలుగేళ్ల పాటు సాఫీగా సాగింది. ఆ తర్వాత మనస్ఫర్ధలు రావడంతో 2021లో ఈ జంట విడాకులు ప్రకటించింది. ఇక సమంతతో విడాకులు తీసుకున్న మూడేళ్లకు నాగచైతన్య నటి శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇటీవలే అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు.

డైరెక్టర్ తో సమంత డేటింగ్

ఇది ఇలా ఉంటే సమంత కూడా మరోసారి ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సమంత రాజ్ నిడిమోరు దర్శకత్వంలో 'ఫ్యామిలీ మాన్', 'సిటాడెల్ సీరీస్ లు చేసింది. అయితే సమంత రాజ్ నిడిమోరు డైరెక్షన్ లో ఫ్యామిలీ మెన్, సిటాడెల్ సీరీస్ లు చేసింది. ఫ్యామిలీ మెన్ సీరీస్ తో మొదటి సారి ఓటీటీ ప్లాట్ పై అడుగుపెట్టిన సామ్ కు ఈ సీరీస్ మంచి విజయాన్ని అందించింది. అంతే కాదు సమంత కాపురంలో చిచ్చు పెట్టింది కూడా ఈ సీరీస్ ఏ అంటూ అనేక వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు సమంత - రాజ్ నిడిమోరు (Raj Nidimoru) డేటింగ్ లో ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది. కొంత మంది మాత్రం వరుసగా రెండు వెబ్ సీరీసుల్లో కలిసి పనిచేయడం వల్లే ఇలాంటి రూమర్స్ వినిపిస్తున్నాయని అంటున్నారు.

publive-image

సిటాడెల్

ప్రస్తుతం సమంత సిటాడెల్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. రాజ్ &డీకే దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సీరీస్ లో సమంత సరసన బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ నటించారు.

Also Read: Bigg Boss Telugu 8: 'దేకో దేకో బిగ్ బాస్ మస్త్ ఆట'.. కలర్ ఫుల్ గా బిగ్ బాస్ ప్రోమో - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు