దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ ఛార్జీలు ఈరోజు అర్ధరాత్రి (జూన్ 3) నుంచి పెరగనున్నాయి. 2025 మార్చి 31 వరకు ఇవి అమల్లో ఉంటాయని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (NHAI) తెలిపింది. ఈ మేరకు టోల్ ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే టోల్ ఛార్జీలు సగటున 5 శాతం పెరగనున్నట్లు NHAI వెల్లడించింది. వాస్తవానికి కొన్ని రోజుల క్రితమే టోల్ ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది.
Also Read: ఏపీలో అధికారం వాళ్లేదే.. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే
ఏప్రిల్ 1 నుంచి ఛార్జీలు పెంచాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకుంది. కానీ కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ ఎన్నికల సంఘానికి టోల్ ఛార్జీల పెంపుపై ఫిర్యాదు చేసింది. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఈసీ.. ఎన్‌హెచ్‌ఏఐకి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్చీల పెంపు అమల్లోకి రానుందని ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది.
Also Read: జూన్ 3న ఆకాశంలో అరుదైన దృశ్యం.. ఆరు గ్రహాలను చూడొచ్చు