Chandra Babu : చంద్రబాబు బెయిల్ పిటిషన్ మీద సుప్రీంలో నేడు విచారణ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు అయిన పిటిషన్ మీద ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బాబుకు ఈ నెల 10వ తేదీన హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. By Manogna alamuru 29 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి IRR Case : ఇన్నర్ రింగ్ రోడ్(Inner Ring Road), ఉచిత ఇసుక, మద్యం అమ్మకాల అక్రమాలు చేశారంటూ ఏపీ సీఐడీ టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) మీద కేసులు నమోదు చేసింది. వీటి మీద ముందస్తు బెయిల్ అప్లై చేశారు బాబు. విచారణ అనంతరం ఏపీ హైకోర్టు(AP High Court) ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే మద్యం కేసులో నిందితుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీ నరేష్‌లకు కూడా హైకోర్టు ముందస్తు బెయిల్‌ను ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన సమయంలో కొన్ని షరతులను కూడా విధించింది. సుప్రీంకోర్టులో విచారణ... అయితే దీని మీద ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆయనకు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బెయిల్ పై బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొంది. దీని మీద ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ఈకేసులో చంద్రబాబు నాయుడికి ముందస్తు బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 10న తీర్పు చెప్పింది. Also Read : Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురు దుర్మరణం.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు.. ఏపీ రాజధాని అమరావతి(Amaravati) పేరుతో చంద్రబాబు తన హయాంలో అవినీతి చేశారని ఏపీ గవర్నమెంటు ఆరోపిస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేష్ కుటుంబంతో.. చంద్రబాబు, నారాయణ క్రిడ్‌ప్రోకు పాల్పడ్డారని అంటోంది. ఐఆర్ ఆర్ అలైన్‌మెంట్ విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా గతంలో సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో, ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబును ఏ-1గా పేర్కొంది. A2గా మాజీ మంత్రి నారాయణ, A14గా నారా లోకేశ్(Nara Lokesh) పేర్లను నమోదు చేసింది. చంద్రబాబుపై నమోదు అయిన కేసులపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో అతని తరఫున లాయర్లు మూడు పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిగిన అనంతరం చంద్రబాబుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. #supreme-court #chandra-babu #irr-case #hearing మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి