Today Gold Rate : పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధరలు.. ఈరోజు రేట్ ఇదే 

వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,600ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,830ల వద్ద ఉన్నాయి.  ఇక వెండి ధర మార్పులు లేకుండా కేజీకి రూ.77,500 వద్ద ఉంది.

Gold Rate Hike: అమ్మో.. బంగారం భారీ షాక్.. ఒక్కసారే ఎంత పెరిగిందంటే!
New Update

Today Gold and Silver Rates : బంగారం.. ఈ మధ్యకాలంలో వరుసగా తగ్గుతూ వచ్చి అందరికీ రిలీఫ్ ఇచ్చింది. కొనడానికి ఇదే సరైన సమయం అనేలా బంగారం ధరలు కిందికి దిగి వచ్చాయి. గత పది రోజుల్లో పది గ్రాముల బంగారం దాదాపుగా 1200 రూపాయలు తగ్గింది. దీంతో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు అందుబాటులోకి వస్తున్నాయని పసిడి ప్రియులు సంతోషించారు. అయితే, ఈరోజు బంగారం ధరలు పెరుగుదలను నమోదు చేశాయి.. పెరిగింది కొంచెమే అయినా.. మళ్ళీ బంగారం ధరలు పెరుగుతాయేమో అనే భయాన్ని పండగ వేళలో బంగారం కొనాలని అనుకునేవారిని టెన్షన్ పెడుతోంది. ఇక వరుసగా తగ్గుతూ వస్తున్న వెండి ధరలు ఆ ధోరణిలోనే ఉన్నాయి.  బంగారం ధరల(Today Gold Rate)తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించడం.. స్థానికంగా బంగారం డిమాండ్ తక్కువ ఉన్నప్పటికీ బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే జనవరి 13 న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది.  దీంతో  దేశీయంగాను బంగారం ధరలు(Today Gold Rate) పెరుగుదల నమోదు చేశాయి.   మరోవైపు వరుసగా తగ్గుతూ  వస్తున్న వెండి ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి.  ఈరోజు అంటే గుశనివారం (జనవరి 13) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.      

హైదరాబాద్ లో బంగారం ధరలు:     

హైదరాబాద్(Hyderabad) లో వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Price) 100 రూపాయలు పెరిగింది. దీంతో  రూ.57,600ల వద్దకు చేరింది.  24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 120 రూపాయలు పెరిగి  రూ. 62,830ల కు చేరుకుంది.   అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Today Gold Rate) పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర(Gold Price Today) 100 రూపాయలు పెరిగి 10 గ్రాములకు రూ.57,750ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,100ల వద్ద మార్పులు లేకుండా  ఉంది. 

Also Read: పండుగ వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు..వెంటనే కొనేయండి మరీ!

వెండి ధరలు ఇలా: 

ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Today Gold Rate) పెరుగుదల నమోదు చేస్తే..  వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో  హైదరాబాద్ లో వెండి కేజీకి  రూ.77,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు మార్పులు లేకుండా ఉన్నాయి. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 76,000 లకు తగ్గింది. 

మరోవైపు అంతర్జాతీయంగానూ బంగారం ధరలు(Today Gold Rate) పెరుగుదల నమోదు చేశాయి.  ఈరోజు ఔన్స్ బంగారం(Today Gold Rate)  2049డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 23.19 డాలర్లుగా ఉంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.

Watch this interesting Video :

#hyderabad #gold-and-silver-latest-prices #delhi #today-gold-rate
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe