Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే.. 

అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. దేశీయంగా కాస్త తగ్గుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ప్రారంభ ధర 10 గ్రాములకు రూ. 56,800లు గానూ, 24 క్యారెట్లు రూ. 61,970లుగానూ ఉంది. వెండి కేజీకి రూ.79,200కు చేరుకుంది. 

New Update
Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే.. 

Gold Rate Today: బంగారం పేరు చెబితే అందరి కళ్ళూ మెరుస్తాయి. కనీసం ఒక్క తులం బంగారమైనా కొనుక్కోవాలి అని అందరూ అనుకుంటారు. దాని కోసమే డబ్బును దాచిపెట్టుకునే వారు చాలామందే ఉంటారు. మన దేశంలో బంగారానికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేతిలో డబ్బు ఉంటె చాలు మన దేశంలో మహిళలు ముందుగా చూసేది బంగారం కొనాలనే. పెళ్లిళ్లు అయినా పేరంటం అయినా.. బంగారం గురించిన ముచ్చట్లే అతివల మధ్యలో ఎక్కువగా వస్తుంటాయి. అలంకరణ కోసం అనే కాదు.. బంగారం దగ్గర ఉంటె అత్యవసర పరిస్థితిలో అక్కరకు వస్తుంది అని అందరూ భావిస్తారు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ గోల్డ్ కి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే, బంగారంలో పెట్టుబడి సురక్షితంగా ఉంటుందనే నమ్మకమే. బంగారానికి ఉండే ఈ డిమాండ్ కారణంగానే రోజూ బంగారం ధరల్లో (Gold Rate) మార్పులు వస్తూనే ఉంటాయి. మరి ఈరోజు బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం.  

గతవారం అంతా పరుగులు తీసిన బంగారం ధరలు(Gold Price) ఈ వారంలో కింది చూపులు చూస్తూ వస్తున్నాయి. తాజాగా ఈరోజు (శుక్రవారం, నవంబర్ 24) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు కొద్దిగా తగ్గుదలను నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు కాస్త పెరుగుదల నమోదు చేశాయి. నిన్నటి ధర కంటే పది గ్రాములకు 50 రూపాయల స్వల్ప తగ్గుదల కనబర్చింది బంగారం.  అంతర్జాతీయంగా ధరలు స్థిరంగా ఉండడడంతో మన దేశంలోనూ బంగారం ధరలు బాగా దాదాపుగా స్థిరంగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు అంటే శుక్రవారం (24.11.2023) బంగారం ప్రారంభ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

హైదరాబాద్ లో నిన్నటి కంటే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50 రూపాయలు తగ్గి రూ. 56,800లు గాఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా స్వల్పంగా 50 రూపాయలు తగ్గింది. దీంతో రూ. 61,970లుగా నిలిచింది. 

Also Read: ఆగని బంగారం ధరల పరుగు.. 80వేలకు దగ్గరలో వెండి..

ఇక హైదరాబాద్ (Hyderabad) లో వెండి ధరలు కొద్దిగా పెరిగాయి. సోమవారం కేజీకి  రూ.79,000లుగా ఉన్న వెండి అదే ధర ఈరోజు 200 రూపాయలు పెరిగి రూ.79,200కు చేరుకుంది. గత వారంలో వెండి ధరలు అనూహ్యంగా పరుగులు తీశాయి. ఈ వారంలో ఇప్పటివరకూ కాస్త అటూ ఇటూ మారుతూ వస్తున్నాయి. 

ఇక ఢిల్లీ మార్కెట్లోనూ ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.  22 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాములకు 50 రూపాయలు తగ్గి రూ. 56,950 మార్కు వద్ద –  24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 50 రూపాయల  నమోదు చేసి  రూ. 62,120 వద్ద ఉంది. అదేవిధంగా వెండి ధరలు కూడా తగ్గుదల బాటలో పడ్డాయి. కిలో వెండి ధర 400 రూపాయాలు తగ్గింది. ఈరోజు ఢిల్లీలో కేజీ వెండి ధరలు రూ. 76,200ల వద్దకు చేరుకుంది. 

అలాగే, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ కు 1993 డాలర్ల వద్ద మార్పులు లేకుండా ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికి వస్తే.. ఇది మాత్రం ఔన్సుకు 23.69 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 

గమనిక: ఇక్కడ అందించిన ధరలు ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్న ధరలు. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అలాగే, స్థానికంగా ఉండే డిమాండ్, టాక్స్ లు వంటివి కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల బంగారం కొనాలి అనుకున్నపుడు మార్కెట్ ధరలను ఒకసారి పరిశీలించడం అవసరం.

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు