CM KCR: టార్గెట్ రాజగోపాల్ రెడ్డి.. నేడు మునుగోడు గడ్డపై కేసీఆర్ మీటింగ్!

మునుగోడులో ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మునుగోడులో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. అయితే కాంగ్రెస్ గూటికి చేరుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ ను మునుగోడు నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. దీని మీద కేసీఆర్ ఇవాళ కౌంటర్ అటాక్ ఇవ్వనున్నారా...కేసీఆర్ ఏం మాట్లాడతారు అన్న అంశం మీద రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

New Update
CM KCR: టార్గెట్ రాజగోపాల్ రెడ్డి.. నేడు మునుగోడు గడ్డపై కేసీఆర్ మీటింగ్!

మునుగోడులో నేడు ప్రజా ఆశీర్వాద సభకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. దీని కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున సభకు ప్రజలను తరలిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వనపర్తి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా మునుగోడుకు చేరుకోనున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. ఇప్పటికే సభకు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం కల్పించడంతో విశేష స్పందన లభిస్తున్నది. మేరకు ఏర్పాట్లు కూడా పూర్తిస్థాయిలో చేశారు. సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. మునుగోడు నుంచి చౌటుప్పల్‌కు వెళ్లే దారిలో ఎడమ వైపున ఉన్న స్థలంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. సభ వేదిక, వీఐపీ, మీడియా, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళల గ్యాలరీలను ప్రత్యేకంగా బారీకేడ్లతో ఏర్పాటు చేశారు. దాదాపు 50 వేలకు మించి సభకు ప్రజలు తరలి వస్తారని అంచనా.

Also Read:అమెరికాలో మళ్ళీ మోగిన తుపాకులు…22 మంది మృతి

అయితే ఇప్పుడు అన్నింటికన్నా ఆసక్తి కలిస్తున్న విషయం ఏంటంటే సీఎం కేసీఆర్ ఏం మాట్లడతారా అని. తాజాగా నియోజకవర్గంలో పరిస్థితులు మారాయి. దానికి తోడు బీజెపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారుతున్న కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి వ్యాఖ్యలు ఈ రోజు సభకు మరింత ప్రాముఖ్యతను తెచ్చాయి. మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే మునుగోడులో తన మీద పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. లేదా తనే గజ్వేల్ లో పోటీ చేసిన కేసీఆర్ ని ఓడిస్తానని అన్నారు. అక్కడి ఉపఎన్నికల్లో 100 మంది ఎమ్మెల్సీలను తీసుకువచ్చి దుర్మార్గంగా తనని ఓడించారని కోమటిరెడ్డి మండిపడ్డారు. అధికార పార్టీ బీఆర్ఎస్ ను ఓడించడమే తన లక్ష్యమని చెప్పారు. అందుకే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని కూడా స్పష్టం చేశారు రాజగోపాల్ రెడ్డి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఈరోజు మునుగోడు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారు అన్న దాని మీదనే అందరి దృష్టి ఉంది. కోమటిరెడ్డికి సీఎం సారు ఎలాంటి అటాక్ ఇస్తారోనని వెయిట్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకట్ రెడ్డిపై సైతం సీఎం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తనదైన శైలిలో పంచ్ లు విమర్శలు చేసే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు