కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన టీజేఎస్‌!

ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ తో పాటు టీజేఎస్‌ కూడా కలిసి నడుస్తుందని కోదండరాం తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో టీజేఎస్‌ పోటీ చేయడం లేదని..అందుకే తమ సంపూర్ణ మద్దతు కాంగ్రెస్‌ కి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన టీజేఎస్‌!
New Update

Congress With TJS:తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలన్ని కూడా తమ వ్యూహాల మీద ఫుల్‌ ఫోకస్‌ పెట్టాయి. అయితే కొందరు రాజకీయ నాయకులు పార్టీలు మారే క్రమంలో కూడా ఉన్నారు. తమకు కేటాయించిన టికెట్ల విషయంలో సంతృప్తిగా లేకపోవడంతో సొంత పార్టీలను వీడి పక్క పార్టీలకు జంప్‌ అవుతున్నారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ (Congress) నుంచి సీనియర్‌ నాయకులు కారెక్కడానికి బయటకు వెళ్లారు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు తమ ఉనికిని మరింతగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి కష్టపడుతున్నారు. కేసీఆర్‌ (KCR) నిరంకుశ పాలన అంతం చేయడానికి కాంగ్రెస్‌ తో కలిసి పని చేస్తామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం (Kodandaram) వివరించారు.

సోమవారం రేవంత్ రెడ్డితో (Revanth Reddy) సమావేశం అయిన తరువాత కోదండరాం మీడియాతో మాట్లాడారు. ప్రజాపరిపాలన కోసం తాము కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ముందుకు నడుస్తున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్‌ తో కలిసి పని చేయాలని అనుకున్నట్లు తెలిపారు.

తమ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలంతా తమ వెంట నడవాలని ఆయన కోరారు. ప్రజాస్వామిక పాలన కోసం కలిసి పనిచేస్తామన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీజేఎస్ (TJS) దూరంగా ఉండనున్నట్లు ఆయన ఇంతకు ముందే ప్రకటించారు.

తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం మద్దతు అవసరమని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌తో కలిసి పని చేయడానికి కోదండరామ్‌ సుముఖత చూపారని తెలిపారు.

Also read: తెలుగింటి కోడలు కాబోతున్న ” సీతారామం” బ్యూటీ?

#assembly-elections #telangana #tjs #revanthreddy #kondadaram #congress #telangana-election-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe