Winter Throat Care: చలికాలం సీజన్ వచ్చిందంటే జలుబు, దగ్గు వంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. వాతావరణ మార్పులు వల్ల ఇవి సాధారణంగానే వస్తాయి. ఈ సమస్యలు వస్తే ఏదైనా తినడానికైనా.. తాగడానికైనా ఎంతో ఇబ్బంది ఉంటుంది. కొందరూ చలికాలం గొంతు గరగరతో బాధపడుతూంటారు. ముఖ్యంగా గొంతులో బ్యాక్టీరియా, ఫంగస్ కలిగించే కఫం ఏర్పడి కొందరికి ఈ సమస్యలు ఎక్కువగా వస్తుంది. అయితే.. కొందరికి తగ్గినా కానీ గొంతులో గరగర మాత్రం అలానే ఉంటుంది. దీంతో దాని నుంచి ఉపశమనం లభించాలంటే చాలా రకాల చిట్కాలను పాటిస్తున్నారు. కానీ.. ఇంట్లో ఉండే వాటితోనే గొంతు గరగరను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఫాలోవ్వాల్సిన చిట్కాలు
- వేడి నీటిలో మూడు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పడితే గొంతు గరగర తొందరగా తగ్గుతుంది.
- ఎలాంటి వ్యాధికైనా పసుపు పాలు ఎంతో మేలు చేస్తాయి. పసుపులో బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతులోని గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది.
- వేడి నీటిలో దాల్చిన చెక్క పొడి, నిమ్మరసం, తేనె కలిపి ఉదయం తాగితే గొంతు గరగర తగ్గుతుంది.
- రోజూ ఉప్పుని నీటిలో వేసుకుని 2 సార్లు తాగాలి. ఇలా తాగితే జలుబు, గొంతు గరగర నుంచి ఉపశమనం దొరుగుతుకుంది.
ఇది కూడా చదవండి: హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ఎప్పుడైనా తిన్నారా..?.. జొన్న దోశలు ట్రై చేయండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: స్త్రీలకు అనాస పువ్వు ఓ వరం.. ఎన్నో రుగ్మతలు మాయం!