Bath: స్నానం చేసే నీటిలో ఇది కలపండి.. దురద సమస్య దెబ్బకు పోతుంది!

చాలామందికి దురద సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. ముఖ్యంగా సీజన్‌ మారుతున్న సమయంలో ఈ ప్రాబ్లెమ్‌ చికాకు పెడుతుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు స్నానపు నీటిలో రెండు చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ వేయవచ్చు. లేకపోతే వేప ఆకులను బాత్‌ వాటర్‌లో కలిపి స్నానం చేయవచ్చు.

Bath: స్నానం చేసే నీటిలో ఇది కలపండి.. దురద సమస్య దెబ్బకు పోతుంది!
New Update

Bath: వాతావరణం మారుతున్న కొద్దీ శరీరంలో అనేక మార్పులు రావడం మొదలవుతాయి. ఈ సీజన్‌లో చాలా మందికి చర్మంపై దురద సమస్య స్టార్ట్ అవుతుంది. ఈ సమస్య కోసం మార్కెట్‌లో అనేక రకాల వస్తువులు అందుబాటులో ఉన్నప్పటికీ అవి కెమికల్స్‌తో కూడినవి ఉంటాయి. అందుకే ఇంటి చిట్కాలతో ఈ దురద సమస్యను వదిలించుకోవచ్చు. శరీరంపై దురదను పోగొట్టడానికి కొన్ని ఇంటి చిట్కాల గురించి మేము మీకు చెప్పబోతున్నాం. ఎక్కువ డబ్బు ఖర్చు లేకుండా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

వేప ఆకులు:

  • వేప ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దేశంలోని ప్రతి వీధి , ప్రాంతంలో ఒక పెద్ద వేప చెట్టును మీరు చూస్తారు. మారుతున్న వాతావరణంలో దురదలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు స్నానం చేసే నీటిలో వేప ఆకులను కలుపుకోవచ్చు.
  • యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు వేపలో ఉన్నాయి. స్నానం చేసే నీటిలో వేప ఆకులను ఉపయోగించాలంటే మీరు వేప ఆకులను మెత్తగా నూరి దాని సారాన్ని తీయాలి. ఈ సారాన్ని స్నానం చేసే నీటిలో వేయవచ్చు.

యాపిల్ సైడర్ వెనిగర్‌:

  • యాపిల్ సైడర్ వెనిగర్‌తో పోడి శరీరం నుంచి ఉపశమనం పొందవచ్చు.బాత్‌ వాటర్‌లో దీన్ని చాలా తక్కువ మోతదులో కలపవచ్చు. 2 చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ వేయాలి. ఆ నీటితో స్నానం చేయండి. ఇది కచ్చితంగా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.

ఉప్పు:

  • రాళ్ల ఉప్పు నెగిటివ్‌ ఎనర్జీ పొతుంది. ప్రతీ రోజూ స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకుని చేస్తే వంటిమీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ, చర్మ సమస్యలు తగ్గుతాయి.

ఇది కూడా చదవండి: బాగా ఆకలి వేస్తుందా..? చిటికెలో తయారు చేసుకునే వంటకాలు ఇవే!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #bath #best-health-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe