Feet white Tips: ఈ చిట్కాలతో పాదాలు తెల్లగా మెరవాల్సిందే..మురికి మొత్తం మాయం

కొందరికి పాదాలు మాత్రం న‌ల్లగా ఉంటాయి. ముఖంపై తీసుకున్నంత కేర్ పాదాల‌పై తీసుకోరు. పాదాల‌పై దుమ్ము, ధూళి, మృత‌క‌ణాలు పోవాలంటే శ‌న‌గ‌పిండి, కీర‌దోస, ట‌మాట, నిమ్మర‌సాలను కలిపి ఈ మిశ్రమాన్ని పాదాల‌కు రాసి 5 నుంచి 10 నిమిషాలు మ‌ర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

New Update
Feet white Tips: ఈ చిట్కాలతో పాదాలు తెల్లగా మెరవాల్సిందే..మురికి మొత్తం మాయం

Feet white Tips: అందంగా ఉండాలనేది ప్రతీ ఒక్కరికి ఇష్టం ఉంటుంది. చాలా మందికి ముఖం, చేతులు, కాళ్లు, మెడ ఇలా అన్ని శరీర భాగాలు అందంగా, తెల్లగా ఉంచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వీటితో పాటు పాదాలు తెల్లగా ఉండాలనుకుంటారు. కొందరికిలో పాదాలు మాత్రం న‌ల్లగా ఉంటాయి. ముఖంపై తీసుకున్నంత శ్రద్ద పాదాల‌పై కొందరూ తీసుకోరు. దీనికి ప్రధాన కార‌ణం పాదాల‌పై దుమ్ము, ధూళి, మృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం, ఎండలో తిర‌గ‌డం, పాదాల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వంటి కార‌ణాలతో పాదాలు న‌ల్లగా ఉంటాయి. కొంతమంది పాదాలు న‌ల్లగా ఉండటం వలన న‌చ్చిన చెప్పుల‌ వేసుకోవాటానికి ఇబ్బంది పడుతారు. కొన్ని చిట్కాలు పాటిస్తే న‌ల్లగా ఉన్న పాదాలు తిరిగి సాధార‌ణ రంగులోకి వ‌స్తాయి. పాదాల‌పై ఉండే న‌లుపు, మృత‌క‌ణాలు తొల‌గిపోయి పాదాలు అందంగా, తెల్లగా ఎలా మారుతాయో కొన్ని చిక్కటాలను తెలుసుకుందాం.

ఇలా చేస్తే పాదాలు తెల్లగా మారుతాయి..

మనకి ఇంట్లో లాభించే స‌హ‌జ సిద్దమైన ప‌దార్థాల‌తో పాదాల‌ను తెల్లగా, అందంగా ఎలా మార్చుకోవచ్చు. ముందుగా పాదాలు న‌ల్లగా ఉన్నవారు వాటిపై ఉండే మురికి, మృత‌కణాలు పోయేలా పంచ‌దార‌ను, నిమ్మకాయ‌తో స్క్రబింగ్ చేసుకోవాలి. తరువాత పాదాల‌ను శుభ్రంగా క‌డిగి గోరు వెచ్చని నీటి 15 నిమిషాలు ఉంచాలి. త‌రువాత స‌గం నిమ్మకాయ ముక్క తీసుకుని పంచ‌దార‌ను చ‌ల్లి పాదాల‌పై సున్నితంగా రుద్దాలి. ఇలా రోజూ 10 నుంచి 20 నిమిషాలు చేసి ఆరిన త‌రువాత పాదాల‌కు మాయిశ్చరైజ‌ర్‌ను రాస్తే మంచి ఫలితం ఉంటుంది. బ‌ట‌య‌కు వెళ్తే స‌న్ స్క్రీన్ లోష‌న్‌ను రాసుకుంటే మంచిది.

ఇది కూడా చదవండి: జీలకర్ర నీళ్లు జీవ క్రియలకు మేలు..ఎన్నో ఔషధ గుణాలు

ఒక ట‌బ్‌లో వేడి నీటిని తీసుకుని అందులో పాలు, గులాబి రేకులు వేసుకోవాలి. ఈ నీటిలో పాదాల‌ను 30 నిమిషాలు ఉంచిన త‌రువాత పాదాల‌ను బ‌య‌ట‌కు తీసి శుభ్రంగా క‌డగాలి. ఇలా చేస్తే పాదాలు మృదువుగా మారటంతోపాటు పాదాల రంగు మెరుగు ప‌డుతుంది. ఇలా చేసిన త‌రువాత పాదాల‌కు శ‌న‌గ‌పిండి, కీర‌దోస, ట‌మాట, నిమ్మర‌సాలను కలపి పేస్ట్‌లాగా చేసుకోని ప్యాక్‌లా వేసుకోవాలి. అది ఆరిన తరువాత పాదాల‌ను శుభ్రంగా క‌డిగి త‌డిని తుడుచుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని పాదాల‌కు రాసి 5 నుంచి 10 నిమిషాలు మ‌ర్దనా చేయాలి. త‌రువాత పాదాల‌కు మాయిశ్చరైజ‌ర్ రాసుకుంటే సుల‌భంగా పాదాలు తెల్లగా మారిపోతాయి. ఇలా త‌రుచూ చేస్తూ ఉండ‌డం వల్ల మంచి ఫలితం మీ సొంతం అవుతాయి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు