Flirting: ఇలా ఫ్లర్టింగ్‌ చేసే వాళ్లతో దూరంగా ఉండండి.. చాలా డేంజర్!

ఫ్లర్టింగ్‌ చేస్తూ అమ్మాయిలను అనవసరంగా తాకుతుంటారు. అలాంటివారికి దూరంగా ఉండాలి. ఫ్లర్టింగ్‌ చేసి అతిగా నవ్వేవారిని కూడా పక్కన పెట్టాలి. అందం గురించి కంప్లిమేంట్‌ ఇచ్చారో, ఫ్లర్టింగ్‌ చేసేరో మాట బట్టి తెలిసిపోతుంది. ఖరీదైన వస్తువులను చూపించి ఇంప్రెస్ చేసేవారిని అమ్మాయిలు దూరంపాటిస్తే మంచిది.

New Update
Flirting: ఇలా ఫ్లర్టింగ్‌ చేసే వాళ్లతో దూరంగా ఉండండి.. చాలా డేంజర్!

Flirting: అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి చాలా మంది అబ్బాయిలు ఎంచుకునే మార్గం ఫ్లర్టింగ్‌. అయితే ఇది మితిమీరితే మొదటికే మోసం వస్తుంది. మీరు ఇవాళ బాగున్నారని చెబితే సరిపోతుంది.. మీరు వెలుగిపోతున్నారని..ఫ్లాష్‌ లైట్‌లా కనిపిస్తున్నారని అర్థం లేకుండా, సమయం సందర్భం లేకుండా మాట్లాడే అబ్బాయిలతో చివరకు ఇరిటేషన్ వస్తుంది. ఎందుకంటే అవి అబద్దాలని అమ్మాయిలకు అర్థమైపోతాయి. ఇలా ఫ్లర్టింగ్‌ చాటును ఎక్కువగా అబద్ధాలు చెప్పేవారికి అమ్మాయిలు దూరంగా ఉంటేనే మంచిది.

అబాద్దాలు చెప్పేవారికి దూరంగా ఉంటే మంచిది:

  • ఫ్లర్టింగ్‌ చేసి అతిగా నవ్వేవారికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వారి జోక్‌కి వారే నవ్వుకోవడం విడ్డూరంగా ఉంటుంది. ఏ కారణంతోనైనా నవ్వడానికి, అనవసరంగా నవ్వడానికి చాలా వ్యత్యాసం ఉంది.
  • ఫ్లర్టింగ్‌ అతిగా చేసేవారు ఎక్కువగా ప్రశ్నలు అడుతుంటారు. సంబంధం లేకుండా టాపిక్‌ను ఎక్కువ సేపు సాగదీస్తారు. ఇది అమ్మాయిలకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందుకే ఇలాంటి వారికి దూరంగా ఉంటే అనవసరమైన తలనొప్పులు ఉండవు.
  • కొంతమంది ఫ్లర్టింగ్‌లో అమ్మాయిలను అనవసరంగా తాకుతుంటారు. ఇలాంటి వాళ్లు చాలా డేంజర్‌. ముఖ్యంగా ఆఫీస్‌ల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. అలాంటి అబ్బాయిలకు దూరంగా ఉంటే బెటర్.
  • కొంతమంది అబ్బాయిలు వారి దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులను చూపించి అమ్మాయిను ఇంప్రెస్ చేయాలని చూస్తుంటారు. అలాంటి వారిని అమ్మాయిలు పట్టించుకోకుండా ఉంటే మంచిది. అలాంటి వారు చేసే ఫ్లర్టింగ్‌ను మొదట్లోనే కట్‌ చేయాలి.
  • ఇంకొంతమంది అబ్బాయిలు హీరోలా ప్రవర్తిస్తారు. అలాంటి వారి ఫ్లర్టింగ్‌ లిమిట్‌ దాటి నలుగురిలో తలదించుకునేలా చేస్తుంది. ఎప్పటికైనా నార్మల్‌గా ఉండే అబ్బాయిలు, సందర్భానుబట్టి మిమ్మల్ని మెచ్చుకుని, మిమ్మల్ని ప్రోత్సాహించే అబ్బాయిలే బెస్ట్ అని అమ్మాయిలు గుర్తుపట్టుకోవాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి:  ఇలా చేస్తే కొత్తిమీర రెండు వారాలైనా పాడుకాదు..తాజాగా ఉంటుంది

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు