Marriage Life Tips : కొత్తగా పెళ్లైందా? ఈ పొరపాట్లు చేయకండి..!

పెళ్లైతే కెరీర్‌ ఎండైనట్టు భావించకండి. మహిళలు ఇది కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కొత్త కుటుంబం కోసం మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకోవద్దు. ఇక తమ భావాలు, కోరికలు, అవసరాలు భర్తలకు భార్యలు ఓపెన్‌గా చెప్పాలి. లేకపోతే ఇది అనవసరమైన గందరగోళంతో పాటు మనోవేదనకు దారితీస్తుంది.

New Update
Marriage Life Tips : కొత్తగా పెళ్లైందా? ఈ పొరపాట్లు చేయకండి..!

Marriage Life Mistakes : జీవితంలో పెళ్లి(Marriage) అందరికీ ఒక ముఖ్యమైన ఘటన. ఆనందంతో పాటు అనేక బాధ్యతలు, సవాళ్లను తీసుకువస్తుంది. పెళ్లి జీవితంలో చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. తెలియక చేసేవి కాబట్టి అవి పొరపాట్లే అనాలి. అయితే అవి కూడా జరగకుండా జాగ్రత్త పడాలి. అటు వివాహం తర్వాత మహిళలు కొన్ని సాధారణ పొరపాట్లు చేసే అవకాశాలు ఉంటాయి. మగవాళ్లు చేసినట్లే ఆడవాళ్లు సైతం చేస్తుంటారు. ఇది సంబంధంపై కొన్నిసార్లు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లెమ్‌తో పాటు, అపార్థాలకు దారితీస్తుంది.

నివారించాల్సినవి ఇవే:
మీరు మీ భాగస్వామితో సంతోషకరమైన, ఆరోగ్యకరమైన సంబంధం కోసం ఎదురుచూస్తున్నట్లయితే, మీరు నివారించాల్సిన కొన్ని సాధారణ పొరపాట్లపై ఓ లుక్కేయండి. కొత్త కుటుంబం కోసం మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకోవద్దు. భార్యగా, తల్లిగా, కోడలిగా కొత్త బాధ్యతలను నిర్వర్తించే ప్రయత్నంలో కెరీర్‌ను పక్కన పట్టవద్దు. ఆశయాల కంటే ఏదీ ఎక్కువ కాదు. కుటుంబాన్ని, కెరీర్‌ను ఈక్వెల్‌గా బ్యాలెన్స్‌ చేసుకోండి. ఒకవేళ అంతిమ లక్ష్యంగా కుటుంబాన్నే మార్చుకుంటే ఇది తరువాత నిరాశ, పశ్చాత్తాపానికి దారితీస్తుంది. ఎందుకంటే కుటుంబ జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. మీ కాళ్ల మీద మీరు నిలబడడం అన్నిటికంటే ముఖ్యం. పెళ్లైతే కెరీర్‌ ఎండైనట్టు భావించకండి.

ఇది కూడా చదవండి: మీరు మంచి వ్యక్తితోనే డేటింగ్‌ చేస్తున్నారని తెలిపే సంకేతాలు ఇవే!

భర్త(Husband) అన్నీ అర్థం చేసుకుంటాడని నమ్మవద్దు. కొంతమంది భార్యలు బయటకు ఏ విషయాన్ని ఎక్స్‌ప్రెస్‌ చేయకుండానే తమ భర్త అన్నీ అర్థం చేసుకుంటారని భావించి పొరపాటు చేస్తుంటారు. తమ భావాలు, కోరికలు, అవసరాలు భర్తలకు తెలుస్తాయని అనుకుంటారు. ఇది అనవసరమైన గందరగోళంతో పాటు మనోవేదనకు దారితీస్తుంది. అందుకే ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయండి. భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం ఉండటం చాలా ముఖ్యం. మీ ఆనందంతో పాటు సమానంగా ఆందోళనలను కూడా పంచుకోండి. సవాళ్ల గురించి ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. కోపంతో సాన్నిహిత్యాన్ని నివారించడానికి ప్రయత్నించవద్దు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు