5 State Assembly Elections : ఐదు రాష్ట్రాల పరిశీలకులతో ఎన్నికల సంఘం సమావేశమవుతోంది. త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ (Election Commission) ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల తేదీలు ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది.
ఇది కూడా చదవండి: Breaking News: నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు.. నుంచి నామినేషన్లు.. ముఖ్యమైన తేదీలివే!
ఇది కూడా చదవండి: మహిళలకు గుడ్ న్యూస్…మరింత తగ్గిన బంగారం ధరలు..కొనేందుకు మంచి ఛాన్స్..!!
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh), మధ్యప్రదేశ్ (Madhya Pradesh), తెలంగాణ (Telangana), మిజోరాం (Mizoram), రాజస్థాన్ (Rajasthan)లలో నవంబర్-డిసెంబర్లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మిజోరాం అసెంబ్లీ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 17తో ముగియనుంది. ఈశాన్య రాష్ట్రంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీల పదవీకాలం వచ్చే ఏడాది జనవరిలో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. తెలంగాణలో బీఆర్ఎస్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి.