Tillu Square: ఓటీటీలోకి టిల్లన్న ఎంట్రీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టిల్లు స్క్వేర్ ఓటీటీలోకి ఎంట్రీకి ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఏప్రిల్ 26 నుంచి తెలుగుతోపాటు కన్నడ, తమిళ, మలయాళ హిందీ భాషల్లోనూ ప్రేక్షకులకు అందుబాటులో ఉంచన్నట్లు ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తెలిపింది.

New Update
Tillu Square: ఓటీటీలోకి టిల్లన్న ఎంట్రీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Tillu Square:  యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. విడుదల తేదీ నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని పలు రికార్డులు బ్రేక్ చేసింది. అనుపమకు కూడా ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. కాగా ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు సినీ లవర్స్ అంతా అత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించింది. ఏప్రిల్ 26 నుంచి తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

"హిస్టరీ రిపీట్ కావడం సాధారణం..అదే టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ కూడా రిపీట్ అవుతాయి. అట్లుంటది టిల్లన్నతోని" అంటూ సామాజిక మధ్యమాల వేదికగా ఓ పోస్టు పెట్టింది. ఇది చూసిన అభిమానులు ఈ మూవీ త్వరలోనే విడుదల కావాలంటూ నెట్టింటా కామెంట్ల్ చేస్తున్నారు.

2022లో రిలీజ్ అయిన డీజే టిల్లు మూవీకి సీక్వెల్ గా ఈ టిల్లు స్వ్కేర్ మూవీ వచ్చింది.సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించారు. రొమాంటిక్ క్రైమ్ కామేడ్ కథతో ఈ సినిమాను రూపొందించింది. మార్చి 29న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల రికార్డు క్రియేట్ చేసింది. సిద్దు జొన్నలగడ్డ యాక్టింగ్కు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ఈ మూవీ దాదాపు రూ 125కోట్లకు పైగా గ్రాస్ సాధించిందని సమాచారం. అయితే ఈ మూవీకి మరో సీక్వెల్ వస్తున్నట్లు సమాచారం. నిర్మాత నాగవంశీ కూడా మరో సీక్వెల్ కు సంబంధించి క్లారిటీ కూడా ఇచ్చారు.

ఇది కూడా చదవండి: పోలింగ్‌ కేంద్రం వద్ద కాల్పులు.. దద్దరిల్లిన ఓటర్లు.. వీడియో వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు