Tiger Fight : కుమురం భీం ఆసిఫాబాద్(Kumuram Bheem Asifabad) జిల్లాలో పులులు(Tigers) మృతి కలకలం రేపుతోంది. రెండు రోజు లక్రితం ఆదివారం ఒక పులి చనిపోగా...ఈరోజు మళ్ళీ ఇంకో పులి మృతి చెందింది. కాగజ్ నగర్ టైగర్ రిజర్వాయర్‌లో ఇది జరిగింది. దరిగాం అటవీ ప్రాంతంలో మృతి చెందిన పులులను గ్రామస్థులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచరం అందించారు. గ్రామస్తుల సమాచారంతో సీసీఎఫ్ శాంతా రాం, అటవీశాఖ అధికారులతో సంఘటనా స్థలాన్ని సందర్శించారు. టెరిటోరియల్ ఫైట్ కారణంగా మొదట పెద్దపులి చనిపోగా..అదే ప్రాంత సమీపంలో రెండు రోజుల తర్వాత మూడు ఏళ్ళ వయసున్న మరో పులి కళేబరాన్ని ఈరోజు గర్తించారు. నేడు అటవీ ప్రాంతాన్ని పీసీసీఎఫ్ రాకేశ్ డోబ్రియల్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పరగ్వేన్ సందర్శించారు.
Also Read:ఏపీకి కేంద్ర ఎన్నికల బృందం..రెండు రోజుల పాటు పర్యటన
పులుల మధ్య ఫైటింగ్ కారణం..
వరుసగా రెండు పులులు చనిపోవడం ఆదంఓళన కలిగిస్తున్న విషయమే అయినా అది సహజసిద్ధం కావడంతో అటవీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దరిగాం అటవీ ప్రాంతంలో టెరిటోరియల్...అంటే ఆధిపత్యం కోసం రెండు పులులు పోట్లాడుకున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆధిపత్యం కోసం రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో పెద్దపులి చనిపోయిందని తెలిపారు. ఈ ఘటన దాదాపు ఐదు రోజుల క్రితం జరిగి ఉండొచ్చని సీసీఎఫ్ శాంతా రాం తెలిపారు. పులికి పోస్ట్ రూట్ నిర్వహించి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపామని చెప్పారు.
నివాసం కోసమే..
ప్రాదేశిక ప్రాంతాలపై ఆధిపత్యం కోసం మనుషులే కాదు..జంతువులు కూడా పోరాడుకుంటాయి. తమ ప్రాంతంలోకి కొత్త జంతువుల రాకను తీవ్రంగా ప్రతిఘటిస్తాయి. ఇందుకు ఉదాహరణే...ఇప్పుడు దరిగాం అటవీ ప్రాంతంలో పులల మధ్య జరిగిన పోరు. నివాసం కోసం రెండేళ్ల పులుల మధ్య జరిగిన పోరులో ఓ పులి చనిపోయిందని తెలిపారు. పులి మెడ, తలపై బలమైన గాయాలు ఉండడంతో రెండు పులుల మధ్య ఘర్షణ వల్లే చనిపోయి ఉంటుందని చెబుతున్నారు. మృతికి ముందు పులి ఒక పశువుపై దాడి చేసినట్లు తెలిపారు. చనిపోయిన పులి కాలు విరగడంతో పాటు విపరీతంగా రక్తస్రావం జరగడంతో అది చనిపోయిందన్నారు. విద్యుత్ షాక్‌తో కానీ, విషప్రయోగం కానీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం NTCA నిబంధనల ప్రకారం చనిపోయిన పులిని ఖననం చేశారు. చనిపోయిన రెండు పులుల్లో ఒకటి ఆడది కాగా రెండో మగ పులి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడపాదడపా పులులు గ్రామస్తులకు కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పటికే పలుమార్లు పశువుల మందపై దాడులు జరిపి గాయపరిచిన, చంపిన సంఘటనలూ ఉన్నాయి. రోడ్డు దాటుతూ, నదీ తీరం వెంట సంచరిస్తున్న పులులు పలువురు జిల్లా వాసుల కంట కూడా పడ్డాయి.