Thummala Nageswara Rao తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనం..

తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం కార్యాక్రామానికి అనుచరులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ముందుగా 2 వేల కార్లు, బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన జెండా లేకపోవడం గమనార్హం. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన జెండాలు దర్శనమివ్వడంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లబోతున్నారనే వార్తకు మరింత బలం చేకూరింది.

New Update
Thummala Nageswara Rao తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనం..

ఖమ్మం జిల్లాలో రాజకీయాలు తారా స్థాయికి చేరుకున్నాయి. తనకు బీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అనుచరులకు మాత్రమే ఆహ్వానం పంపారు. కానీ తన అనుచరులతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సైతం పెద్ద ఎత్తున ఈ సమావేశానికి తరలి వచ్చారు. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు భారీ కాన్వాయ్‌తో సభా ప్రాంతానికి వెళ్లారు.

ముందుగా తుమ్మల అనుచరులు 2 వేల కార్లు, బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమావేశానికి బయలు దేరిన తుమ్మల నాగేశ్వరరావుకు అడుగడుగునా స్వాగతం పలికారు. తుమ్మల సైతం అనుచరులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మరోవైపు ఆత్మీయ సమావేశంలో తుమ్మల ఫోటోతో ఉన్న జెండాలు మాత్రమే దర్శనమిచ్చాయి.. కేసీఆర్‌, కేటీఆర్‌ల ఫొటోలు ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం అంతే కాకుండా తుమ్మల నాగేశ్వరరావు ర్యాలీలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జెండాలు కన్పించడంతో ఆయన కాంగ్రెస్‌ వైపే ముగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన అనుచరులతో నిర్వహించనున్న ఆత్మీయ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

కాగా ఇటీవల బీఆర్ఎస్‌ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్‌లో తుమ్మల నాగేశ్వరరావు పేరులేదు. సీఎం కేసీఆర్‌ తుమ్మలకు బదులు పాలేరు అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే అప్పగించారు. ఈ స్థానం నుండి పోటీ చేయాలని తుమ్మల నాగేశ్వరరావు భావించినా ఆయనకు టికెట్‌ దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. దీంతో పార్టీ మారాలని ఆయని డిసైడ్‌ అయ్యినట్లు, ఆత్మీయ సమ్మెళనం అనంతరం పార్టీ మార్పు గురించి, తాను ఏ పార్పీలోకి వెళ్తున్నాననే దానిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

ALSO READ:   కాంగ్రెస్‌ పార్టీ 70 స్థానాల్లో విజయం సాధిస్తుంది

Advertisment
Advertisment
తాజా కథనాలు