Prakasam : ఏపీలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం

డిసెంబర్ 31న రాత్రి ప్రకాశం జిల్లా బెస్తవారిపేట్ మండలం చెట్టిచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాపాయిపల్లికి చెందిన పవన్,రాహుల్, శ్రీనివాసులు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరిగి బైక్ పై ఇంటికి వస్తుండగా బొలెరో వాహనాన్ని ఢీకొట్టి అక్కడికక్కడే చనిపోయారు.

New Update
Prakasam : ఏపీలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం

Prakasam District : కొత్త సంవత్సరం రోజే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. న్యూ ఇయర్(New Year 2024) పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి రాత్రి వరకూ ఆడిపాడిన ముగ్గురు యువకులు రోడ్డు(Road accident) ప్రమాదంలో దుర్మరణం చెందడం స్థానికులను కలిచివేసింది.

ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 31న రాత్రి ప్రకాశం జిల్లా(Prakasam District) బెస్తవారిపేట్ మండలం చెట్టిచర్లసమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరిగి బైక్ పై ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రాత్రిపూట పవన్(Pavan 21), రాహుల్(Rahul 21), శ్రీనివాసులు(Srinivasulu 20) ముగ్గురు ఒకే మోటారు సెకిల్ మీద వస్తుండగా బొలెరో వాహానాన్ని బలంగా ఢీ కొట్టారు. దీంతో స్పాట్ లోనే ముగ్గురు ప్రాణాలు కొల్పోయారు. అయితే వీరి బండి నేరుగా బొలెరో పెట్రోల్ ట్యాంక్ కు బలంగా తగలడంతో పెట్రోల్ ట్యాక్ పేలీ మంటలు చెరరేగాయి. ఆ మంటలు అంటుకుని మృతదేహాలు కూడా సగానికిపైగా కాలిపోయాయి.

ఇది కూడా చదవండి : Crime: పండగపూట దారుణం.. ఏపీలో బాలికపై గ్యాంగ్ రేప్

ఇక విషయం తెలియగానే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ముగ్గురు యువకులు పాపాయిపల్లికి చెందిన వారిగా గుర్తించారు. అయితే కారులో ఉన్న వాళ్ల పరిస్థితి గురించి ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఇక ఆ ముగ్గురికి కూడా పట్టుమని పాతికేళ్లు లేకపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

Advertisment