Telangana : హైదరాబాద్‌లో విషాదం..ముగ్గురిని మింగేసిన మ్యాన్‌హోల్ హైదరాబాద్‌లో పెను విషాదం సంభవించింది. పాతబస్తీలోని పురానాపూల్లో మ్యాన్‌హోల్‌లో విషవాయువులు పీల్చి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఒకరిని కాపాడబోయి మరో ఇద్దరు ఈ వాయువులకు బలయ్యారు. By Manogna alamuru 02 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి 3 People Died In Manhole Incident : మురికి నీరు, చెత్త వెళ్ళడానికి వీలుగా ఏర్పాటు చేసే మ్యాన్ హోల్స్(Manhole) మరో సారి ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్నాయి. సాధారణంగా ఇందులో పడి కొట్టుకుపోయాయి చాలా మంది బలవుతుంటారు. వర్షాలు(Rains) పడినప్పుడు మ్యాన్ హోల్స్‌కు మూతల్లేక, చిన్నారులు ఆడుతూ... వాటిని క్లీన్ చేయడానికి కార్మికులు దిగినప్పుడు ఇలా రకరకాల సంఘటనల్లో వీటిల్లో పడి దుర్మరణం చెందారని వార్తలు వస్తుంటాయి. ఇప్పుడు మళ్ళీ అదే జరిగింది. అయితే ఈసారి మ్యాన్‌హోల్‌లో విషయవాయువులు కారణంగా ముగ్గురు బలయ్యారు. మ్యాన్‌హోల్‌లో విషవాయువులు.. హైదరాబాద్(Hyderabad) లో విషాదం చోటు చేసుకుంది. డ్రైనేజ్ పైప్ లైన్ రిపేర్(Drainage Pipe Line) కోసం దిగిన ముగ్గురు కూలీల(3 Workers) చనిపోయారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఒకరిని కాపాడబోయి మరో ఇద్దరు కూడా కన్నుమూశారు. పురానాపూల్ పాత బ్రిడ్జ్ సమీపంలో హనుమాన్ టెంపుల్ దగ్గర మ్యాన్‌హోల్స్ మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయి. ఇందులో 1200MM పైప్‌లైన్లు వేసే పనులు చేస్తున్నారు. ఈపనుల్లో భాగంగా అందులో ముందుగా మహబూబ్‌నగర్‌కు చెందిన రాములు దిగారు. అయితే మ్యాన్ హోల్‌లో విషవాయువులు వ్యాపించి ఉన్నాయి. ఈ విషయాన్ని రాములు దిగాక గుర్తించారు. కానీ తరువాత బయటకు రావడం కష్టం అయింది, అక్కడే ఇరుక్కుపోయారు. దీనిని గమనించిన నారాయణ్‌ఖేడ్‌కు చెందిన హనుమంతు, వనపర్తికి చెందిన శీను కూడా మ్యాన్ హోల్‌లో దిగారు. ఒకరిని కాపాడబోయి ఇద్దరు మృతి.. మ్యాన్‌హోల్‌లో పనిచేసేందుకు 8 ఫీట్ల లోతులోకి దిగారు రాములు. ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్దిచిన మరో ఇద్దరు వర్కర్లు హనుమంతు, శ్రీను కూడా మ్యాన్ హోల్‌లోకి దిగారు. అప్పటికే అక్కడ రాములు విషవాయువులు పీల్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఇతని తర్వాత హనుమంతు, శ్రీను కూడా అదే స్థితిలోకి వెళ్ళిపోయారు. విషవాయువులు పీల్చడంతో ఊపిరాడక ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో ఒకరిని ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో ఇద్దరి మృతదేహాలను డీఆర్ఎఫ్ సిబ్బంది బయటికి తీసుకు వచ్చింది. మురుగు కాలవలను పరిశుభ్రం చేసేందుకు ఈ ముగ్గురిని ఓ ప్రైవేట్ ఏజెన్సీ నియమించుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు... అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ వారు చనిపోయారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. సేఫ్టీ మెజర్స్మెంట్స్ విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోకపోవటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ముగ్గరు వర్కర్లు ఏ కంపెనీకి అయితే పని చేస్తున్నారో ఆ ప్రైవేటు ఏజెన్సీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read : Jobs : డిగ్రీ ఉంటే చాలు..బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు #telangana #hyderabad #3-people-died-in-manhole-incident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి