Alluri district: పోలీసుల అదుపులో మావోయిస్టులు.. మందుగుండు సామగ్రి స్వాధీనం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల అనుమానితులను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా ఏపీలో ముగ్గురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వీరంతా పలు కేసుల్లో నింధితులుగా ఉన్నారని పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. By Vijaya Nimma 18 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలంలో పోలీసులు తనిఖీలు చేశారు. ముగ్గురు మావోయిస్టులు అరెస్ట్ చేశారు. ఒక మహిళా మావోయిస్టుతో పాటు ముగ్గురు మిలీషియా సభ్యులను అరెస్టు చేశారు ఏటపాక పోలీసులు. అరెస్టయిన మహిళ మావోయిస్టు కుంట LOS పార్టీకి చెందిన సోడి మంగి(25)గా గుర్తించారు. ముగ్గురు మిలీషియా సభ్యులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాకి చెందిన మడకం లింగ, మడకం రామయ్య, కురసం భీమయ్యగా గుర్తించారు. వీరి వద్ద రెండు డిటోనేటర్లు, కార్డిఎక్స్ వైర్, పది ఇనుప ముక్కలు, చిన్న బ్యాటరీ, పది మీటర్ల వైరు స్వాధీనం చేసుకున్నారు. Your browser does not support the video tag. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో తనిఖీలు రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో ముగ్గురు మావోయిస్టు కొరియర్లు పట్టుబడిన విషయం తెలిసిందే. శనివారం భద్రాచలం పట్టణ ఎస్ఐ, పోలీసులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో తనిఖీలు నిర్వహించారు. 7వ నెంబర్ ఫ్లాట్‌ఫారం దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా చర్ల మండలం నాయకులకొత్తూరు గ్రామానికి చెందిన గుంజి విజయ్, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బడితండాకు చెందిన భూక్యా నవీన్, హన్మకొండ జిల్లా భీందేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన బొంత నవీన్‌గా పోలీసులు గుర్తించారు. ఆ వివరాలను భద్రాచలం ఏఎస్పీ పరితోశ్ పంకజ్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. నలుగురు వ్యక్తులు అరెస్ట్ ములుగు జిల్లా వాజేడు మండలంలో మావోయిస్టులకు సహకరిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాజేడు, వెంకటాపురం మండలాల చేసిన సీఐ బండారు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మావోయిస్టు కదలికల నేపథ్యంలో ఛత్తీస్‌ఘఢ్, తెలంగాణ సరిహద్దులో తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా పోలీసులు పక్కా సమాచారంతో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో సీఐ బండారు కుమార్, వాజేడు ఎస్సై చావళ్ళ వెంకటేశ్వరావు, 39 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ క్యాంప్ టీంతో కలిసి మండలంలో వాహనాలు తనిఖీ చేశారు. ఏటూరునాగారం నుంచి బైక్‌పై వచ్చిన నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. వారు యాదగిరి, శివరాత్రి పవన్ కళ్యాణ్, ఎల్మకంటి మహేష్, కలకోట ప్రభాకర్‌లు పోలీసులను చూసి బైక్‌ను వెనక్కి తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారిని విచారించారు. ఇది కూడా చదవండి: కలలో పాము కనిపించిందా..? #maoists #arrested #alluri-district #three #etapaka-mandal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి