Covid Cases: ఏలూరులో నమోదైన కరోనా కేసు..ఇప్పటి వరకు ఏపీలో ఎన్ని కేసులంటే!

ఏపీలో 3 కరోనా కేసులు నమోదు అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఏలూరులో ఓ ప్రైవేట్ మెడికల్ వైద్యునికి కొవిడ్‌ పాజిటివ్‌ గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఏపీ సీఎం జగన్‌ అన్నారు.

New Update
Covid Cases: ఏలూరులో నమోదైన కరోనా కేసు..ఇప్పటి వరకు ఏపీలో ఎన్ని కేసులంటే!

ఏపీ లో కొత్తగా మూడు కరోనా కేసులు నమోదు అయ్యినట్లు వైద్యాధికారులు వివరించారు. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 328 కేసులు నమోదు అయితే వాటిలో మూడు ఏపీవే ఉన్నట్లు కేంద్రం తెలిపింది. అయితే ఇప్పడు రాష్ట్రంలో నమోదైన కేసులు పాత వేరియంట్‌ కొవిడ్‌ 19 వా, లేక కొత్త వేరియంట్‌ జేఎన్‌ 1 వా అనేది అధికారులు వివరించలేదు.

తాజాగా ఏలూరు జిల్లాలో ఓ కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయ్యింది. ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజ్‌ డాక్టర్‌ కి కొవిడ్‌ పాజిటివ్‌ గా తేలింది. వేరియంట్‌ నిర్థారణ కోసం శ్వాబ్‌ ను హైదరాబాద్‌ జినోమ్ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ కి పంపించారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి కొవిడ్‌ కి సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేవని..ఎవరూ కంగారు పడనవసరం లేదని అధికారులు తెలిపారు.

పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇతర రాష్ట్రాలకు వెళ్లి రాలేదని కూడా వివరించారు. రాజమండ్రి లో కూడా తొలి కొవిడ్‌ కేస్‌ నమోదు అయ్యిందని అధికారులు వివరించారు. 85 ఏళ్ల మహిళకు కొవిడ్‌ సోకినట్లు అధికారులు తెలిపారు. ఈ మహిళకు సంబంధించిన శాంపిల్స్‌ ను కూడా ల్యాబ్‌ కు పంపినట్లు అధికారులు వివరించారు.

రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అప్రమత్తం అయ్యారు. రాష్ట్ర వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు.

ముందున్నది అంతా పండగ సీజన్‌ కాబట్టి మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. దీంతో అప్రమత్తం అయిన అధికారులు ర్యాపిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, న్యుమోనియా ఇబ్బందులున్నవారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే అధికారులు అంతా వైద్యులు, సిబ్బంది, రోగులు మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.

భారత్ లో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 3వేలకు చేరుకుంది. దేశంలో జెఎన్-1 వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలనఇ ఆరోగ్యశాఖ సూచిస్తోంది. అయితే ఈ వేరియంట్ అంత ప్రమాదకరమైనది కాదని డబ్లూహెచ్వో తెలిపఇంది. ప్రస్తుతం భారత్ లో కరోనా మరణాల రేటు 1.18గా ఉంది. కానీ నిన్న ఒకే రోజు ఆరుగురు చనిపోవడం మాత్రం ఆందోళన కలిగించే విషయమని వైద్యాధికారులు చెబుతున్నారు. 

Also read: ఏసీబీ కోర్టులో లోకేష్‌ పై సీఐడీ మోమో!

Advertisment
తాజా కథనాలు