BRS LEADERS TO JOIN CONGRESS: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు ఎదురవుతున్నాయి. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ నేతలను కాపాడుకునే పనిలో పడింది బీఆర్ఎస్ అధిష్టానం. తాజాగా మరో ముగ్గురు బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ముఖ్య నేతలు.. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, హైదరాబాద్ GHMC మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గత కొంత కాలంగా బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న వారు కాంగ్రెస్ లో చేరనున్నారు.
ALSO READ: డబుల్ బెడ్రూం పథకంలో స్కాం.. కాగ్ నివేదికలో వెల్లడి
మాజీ మంత్రికి ఎంపీ టికెట్..?
రేపు కాంగ్రెస్ లో చేరుతున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డకి కాంగ్రెస్ పార్టీ కీలక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయనకు చేవెళ్ల ఎంపీ టికెట్ ను కాంగ్రెస్ హైకమాండ్ ఇవ్వనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న పట్నం మహేందర్ ఎంపీ టికెట్ హామీతోనే కాంగ్రెస్ లో చేరనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే.. చేవెళ్ల టికెట్ విషయంపై త్వరలోనే ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే చర్చ మొదలైంది. ఈ చర్చకు దారి తీసింది.. మాజీ మంత్రి మల్లారెడ్డే. ఓకే సభలో పాల్గొన్న మల్లారెడ్డి త్వరలో ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు అని అన్నారు. దీనిపై ఎంపీ రంజిత్ రెడ్డి స్పందించక పోవడంతో ఆయన త్వరలో కారు దిగి హస్తం గూటికి పోనున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరందుకుంది.
మరో 26 మంది...
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. అయితే.. మరో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయని.. కాంగ్రెస్ లో చేరడం వారి ఇష్టం అని అన్నారు. మరి నిజంగానే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా? లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది.
DO WATCH: