Andhra Pradesh : విజయవాడలో ఇన్సూరెన్స్ కోసం వరద బాధితుల క్యూ

తెలుగు రాష్ట్రాల్లో వరద తీరని కష్టాలను మిగిల్చింది. ఇళ్ళు మునిగిపోయాయి. ఫర్నిచర్ నాశనం అయిపోయింది. వాహనాల సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. ఇప్పుడు వరద తగ్గుముఖంపట్టడంతో నానిపోయిన బళ్ళతో జనాలు ఇన్సూరెన్స్ కోసం క్యూ కడుతున్నారు.

Andhra Pradesh : విజయవాడలో ఇన్సూరెన్స్ కోసం వరద బాధితుల క్యూ
New Update

Thousands Of Vehicles Effected With Flood : విజయవాడ (Vijayawada) లో వందల కార్లు, వేల బైకులు, ఆటోలు, ట్రాలీలు వారం రోజులుగా వరద ముంపులోనే ఉండిపోయాయి. ఇప్పుడు వర్షాలు తగ్గి వరద నీరు వెనక్కు వెళ్ళిపోవడంతో అవి ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. బురదలోంచి బయటపడ్డ వాహనాలు నామరూపాల్లేకుండ పోయాయి. రంగులు పోయి, లొత్తలు పడిపోయి, అద్దాలు, డోర్లు పగిలిపోయి, సీట్లు నానిపోయి దారుణంగా తయారయ్యాయి. కొన్ని వాహనాలు అయితే అసలు మళ్ళీ నడుస్తాయా అన్నట్టు అయిపోయాయి. మరికొన్ని వాహనాలు వరదలో కొట్టుకు వెళ్ళిపోయాయి. ఇప్పుడు వాటిని వెతుక్కుంటున్నారు.

బురదలో ఉండిపోయిన వాహనాలను నెమ్మదిగా మెకానిక్ షెడ్ల (Mechanic Shed) కు చేరుస్తున్నారు యజమానులు. ప్రస్తుతం విజయవాడలో ఏ మెకానిక్ షెడ్ చూసినా ఫ్లడ్ ఎఫెక్టెడ్ వెహకిల్సే. ముంపు ప్రాంతాలకు దగ్గరలో ఉన్న షాపులన్నీ రద్దీగా మారాయి. ప్రతి షెడ్‌ దగ్గరకు వందలాది వాహనాలు రిపేర్ కోసం వస్తున్నాయి.మరోవైపు వాటన్నింటినీ బాగుచేయలేక మెకానిక్‌లకు కూడా కష్టమయిపోతోంది. రోజుల సమయం పడుతుందని చెప్పినా బండి నడవడకపోదా అనే ఆశతో రిపేర్ చేయండని చెబుతున్నారు.

మరోవైపు తొందరపడి బైక్‌లను, కార్లను స్టార్ట్ చేఒద్దని సూచిస్తున్నారు మెకానిక్ నిపుణులు. బైక్‌లు, మోపెడ్‌లకు పెద్దగా సమస్యలు రావని అంటున్నారు. ఎందుకయినా మంచిది వరదలు, భూకంపాల కవరేజీ ఉందో లేదో చెక్ చేసుకుని ఆ ప్రకారం బండిని బాగు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త బళ్ళు అయితే షో రూమ్‌ వాళ్ళే రిపేర్ చేయించి ఇస్తారని అంటున్నారు. ఇక బైక్లు, కార్లు, ఆటోలు, ఇలా వాహనాలన్నింటినీ శుభ్రం చేసే బాధ్యత కూడా తామే తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. వాటికి రిపేర్లు చేయించే బాధ్యత కూడా తమదేనన్నారు. ఆయా వాహనాల ఇన్సూరెన్సు క్లెయిమ్స్ సైతం 15 రోజుల్లో సెటిల్ అయ్యేలా చూసేందుకు బ్యాంకర్లు, ఇన్సూరెన్స్‌ కంపెనీ (Insurance Company) ప్రతినిధులతో సమావేశమయ్యామని తెలిపారు. ఈఎంఐల విషయంలో ఒత్తిడి ఉండదని తెలిపారు.

Also Read: Andhra Pradesh: వరదలపై కేంద్రానికి నివేదిక– సీఎం చంద్రబాబు

#vehicles #vijayawada-floods #andhra-pradesh-floods #insurance-company
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe