Sunrise Benefits : ఉదయం నిద్రలేచిన వెంటనే సూర్య కిరణాలను (Sunrise) చూడటం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) కలుగుతాయి. సూర్య కిరణాలు కంటికి తగలగానే పీనల్ గ్లాండ్ ఉత్తేజితమౌతుంది. దీంతో రోజు మొత్తాన్ని ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా, ఆనందంగా గడిపేస్తారు. సవాళ్లను సైతం సమర్ధవంతంగా ఎదుర్కోవడంతోపాటు విధులను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారని నిపుణులు చెబుతున్నారు.
ఈ మేరకు సూర్యోదయంతో రోజును మొదలు పెడితే ఆరోజంతా మొత్తం సానుకూల దృక్పధంతో ఉంటారు. శరీరం ఫిట్ గా ఉండేందుకు, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన డి విటమిన్ (Vitamin D) సూర్యకిరణాల ద్వారా శరీరానికి అందుతుంది. అందువల్ల శరీర ఆరోగ్యం మెరుగుపరుచుకోవటానికి ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయం చూడటం మంచిది. సూర్యకాంతి మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఖనిజాల జీవక్రియతోపాటు, అంతర్గత స్రావాన్ని జాగ్రత్తగా చూసుకునే గ్రంధులకు సహాయపడుతుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి (Immunity Power) పెరిగి ఎన్నో రకాల జబ్బుల నుండి పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది. సూర్యోదయాన్ని చూడటం ద్వారా జీవితం ప్రకాశవంతమైన రంగును సంతరించుకుంటుంది. సూర్యోదయానికి ఎదురగా నిలబడటం వల్ల చర్మసంబంధిత సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవచ్చు. సూర్యోదయంతో రోజును మొదలు పెడితే ఆరోజు మొత్తం సానుకూల దృక్పధంతో ఉంటారు. అలాగే సూర్యోదయానికి ముందు నిద్రలేచిన వారే రోజాంత హుషారుగా, ఆరోగ్యంగా ఉంటున్నట్లు పలు సర్వేల ఆధారంగా నిరూపితమైందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
Also Read : నటి హేమకు మరోసారి నోటీసులు