Telangana Politics: బీఆర్ఎస్‌లోకి రాజేందర్...యాదవుల్లో కొత్త జోష్

పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో ప్రముఖ రియాల్టర్ బొమ్మన బోయిన రాజేందర్ యాదవ్ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈరోజు తొర్రూరులో భారీగా నిర్వహించిన యాదవ సింహ గర్జన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.

Telangana Politics: బీఆర్ఎస్‌లోకి రాజేందర్...యాదవుల్లో కొత్త జోష్
New Update

కాంగ్రెస్ బ్రోకర్ మాటలను నమ్మొద్దు. వాళ్లు డబ్బు సంచులతో వచ్చి ఉపన్యాసాలు దంచిపోతారు. ప్రజలకు మొండి చేయి చూపిస్తారు. ఎప్పటికైనా తెలంగాణకు సీఎం కేసీఆర్ పరిపాలనే శ్రీరామరక్ష. సార్‌ను నమ్ముకుంటే మనం చల్లంగా ఉంటాము. ప్రజలు అప్రమత్తంగా ఉంది మరోసారి సీఎం కేసీఆర్‌కు అవకాశం కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ సందర్భంగా.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ దుష్ట పరిపాలన వలె తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. దేశాన్ని ఏకధాటిగా 40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ వాళ్లు ఇవ్వాళ సీఎం కేసీఆర్ అందిస్తున్న దళితబంధు, రైతుబంధు, రైతుబీమా, పెన్షన్లు, కేసీఆర్ కిట్లు వంటి పథకాలను అమలు చేశారా..? అని ఆయన ప్రశ్నించారు. వాళ్లు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలను అమలు చేస్తున్నారా..? అక్కడ ఇవ్వని కాంగ్రెస్ తెలంగాణలో అలవి గాని హామీలు ఇస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు. జనాలకి ఇచ్చేది లేదు అన్నారు. అలాంటి వాళ్ళను నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే నని చెప్పారు.

This browser does not support the video element.

తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి రాష్ట్రంలో అనేక వినూత్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రారంభించి అమలు చేస్తూ ప్రజలను అన్ని విధాలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష! కేసీఆర్‌ఆర్ బాగుంటే, మనం బాగుంటాము. బీఅర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను మనం కాపాడుకోవాలి. మనల్ని కేసీఆర్‌ఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటారని.. మరోసారి కేసీఆర్‌ను గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్‌లో చేరిన బొమ్మన బోయిన రాజేందర్‌కు త్వరలోనే తగిన గుర్తింపు గౌరవం దక్కేలా చూసే బాధ్యత నాదని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకొని ప్రజాసేవకే అంకితమైన రాజేందర్‌ను కడుపులో పెట్టుకునే బాధ్యత నాదేనని మంత్రి తెలిపారు.

రాజేందర్‌కు తగిన గుర్తింపు

తొర్రూర్‌లోని అయ్యప్ప గుడికి బొమ్మన బోయిన రాజేందర్ యాదవ్ అందించిన 15 లక్షల రూపాయల చెక్కులు మంత్రి తన చేతుల మీదుగా సంబంధిత దేవాలయ ట్రస్టుకు అందజేశారు. అలాగే మంత్రి సైతం ఆ గుడికి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గంగమ్మ గుడి దేవాలయ నిర్మాణానికి మంత్రి మరో 10 లక్షల రూపాయలను మంత్రి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు తొర్రూరు పట్టణంలోని బాల కేంద్రం నుంచి ఆర్ అండ్ బీ అతిథి గృహం మీదుగా ఎల్‌వైఆర్ గార్డెన్ వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో మంత్రి ఓపెన్ టాప్ వాహనమెక్కి ప్రజలకు అభివాదం చేస్తూ పయనించారు. ఈ సందర్భంగా మంత్రికి యాదవులు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు యాదవ సంఘాల ప్రముఖులు అనేకమంది యాదవులు మహిళలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: కొండబాబుపై ద్వారంపూడి సంచలన వాఖ్యలు..అవినీతి చిట్టా బయటపెడతానని హెచ్చరిక

#chief-guest #yadava-lion-roar #thorrur #minister-errabelli-dayakar-rao #program
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe