This Week OTT Release : ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు .. ఓటీటీ ప్రియులకు పండగే

సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో సందడి చేసిన సినిమాలు ఓటీటీ ప్రేక్షక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మహేష్ బాబు గుంటూరు కారం, ధనుష్ కెప్టెన్ మిల్లర్, కాటేరా పలు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఈ వారం ఓటీటీ సినిమాల లిస్ట్ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

This Week OTT Release : ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు .. ఓటీటీ ప్రియులకు పండగే
New Update

This Week OTT Release : సంక్రాంతి(Sankranti) తర్వాత గత వారం అన్నీ చిన్న సినిమాలే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. రిలీజైన ఐదు సినిమాల్లో ఒకటి, రెండు తప్పా మిగతా సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఇక ఈ వారం ఓటీటీ(OTT) లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం సంక్రాంతి కానుకగా విడుదలైన స్టార్ హీరోల చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యాయి. ఓటీటీ ప్రియుల కోసం ఈ వారం ఓటీటీల్లో అలరించబోయే సినిమాల లిస్ట్ ఇప్పుడు తెలుసుకుందాము..

గుంటూరు కారం

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu) మాస్ యాక్షన్ డ్రామా గుంటూరు కారం(Guntur Kaaram). సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 9 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

కెప్టెన్ మిల్లర్

ధనుష్ (Dhanush) లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్(Captain Miller). అరుణ్ మాథేశ్వరన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. జనవరి 25న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఫిబ్రవరి 9న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది.

publive-image

Also Read : Family Star : ఫ్యామిలీ స్టార్ వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపొయింది

భక్షక్‌

భూమి పెడ్నేకర్ నటించిన భక్షక్‌(Bhakshak). యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి పుల్కిట్ దర్శకత్వం వహించారు. సస్పెన్స్ క్రైమ్ త్రిల్లర్ గా ప్రేక్షకులను అలరించనున్న భక్షక్‌ఫిబ్రవరి 9 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఆర్య-3

సుస్మితా సేన్, సికిందర్ ఖేర్, అంకుర్ భాటియా, వికాస్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. రామ్ మాధ్వాని, సందీప్ మోదీ, వినోద్ రావత్ సంయుక్తంగా డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ సీరీస్ ఫిబ్రవరి 9 న డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

publive-image

బబుల్‌గమ్‌

స్టార్ యాంకర్ సుమ కనకాల డెబ్యూ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం బబుల్‌గమ్‌(Bubble Gum). రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 9 న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా(Aha) లో స్ట్రీమింగ్ కు రానుంది.

జియో సినిమా

ఎ ఎగ్జార్సిస్ట్‌ (హలీవుడ్) మూవీ : ఫిబ్రవరి 6

ది నన్‌2 (హాలీవుడ్) మూవీ: ఫిబ్రవరి 7

హలో (వెబ్‌ సిరీస్‌): ఫిబ్రవరి 8

Also Read : Saindhav OTT Release : వెంకటేష్ సైంధ‌వ్ ఓటీటీ రిలీజ్.. అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

#guntur-kaaram #ott-platforms #tollywood #ott-release-this-week
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe