OTT Releases This Week: ఈ వారం ఓటీటీ ధమాకా.. అదిరిపోయే సినిమాలు

ఈ వారం ఓటీటీ వేదిక పై విడుదలకు సిద్దమవుతున్న సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు.

New Update
OTT Releases This Week: ఈ వారం ఓటీటీ ధమాకా.. అదిరిపోయే సినిమాలు

OTT Releases This Week: ఈ మధ్య కాలంలో ఓటీటీ(OTT) వేదిక చాలా పాపులారిటీని పొందింది. ఓటీటీ లో ఎన్నో రకాల సినిమాలు, వెబ్ సిరీస్, రియాలిటీ షోస్ తో ప్రతి వారం కొత్త కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కామెడీ, యాక్షన్, డ్రామా, రొమాంటిక్, త్రిల్లర్ ఇలా ఏది కావాలంటే అది హాయిగా ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు.

అయితే ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్ ఇదే..

‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr. Polishetty) 

అనుష్క, నవీన్ పోలిశెట్టి నటించిన ఈ సినిమా గత నెలలో థియేటర్స్ లో విడుదలయ్యి ప్రేక్షకులను అలరించింది. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్, అనుష్క నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికైన నెట్‌ఫ్లిక్స్‌ లో(Netflix) అక్టోబర్ 5 న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

‘ఓ మై గాడ్‌ 2’ (OMG 2)

2012 లో విడుదలైన ‘ఓ మై గాడ్‌'(OMG) చిత్రానికి సీక్వెల్ గా అమిత్ రాయ్ దర్శకత్వంలో హీరో అక్షయ్ కుమార్ దేవుడి పాత్రలో నటించిన ‘ఓ మై గాడ్‌ 2’ (OMG 2) సినిమా ఓటీటీ వేదికైన నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) అక్టోబరు 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

దర్శకుడు విప్లవ్ కోనేటి దర్శకత్వంలో నటి హెబ్బా పటేల్, నరేష్, పవిత్ర లోకేష్ కీలక పాత్రల్లో నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్’ (The Great Indian Suicide). అక్టోబర్ 6 న ఓటీటీ వేదికైన 'ఆహా'(Aha) లో విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమాను మదనపల్లిలో చోటు చేసుకున్న యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.

Also Read: శివుడి రూపంలో ప్రభాస్…సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఏఐ ఫోటోలు

గదర్ 2 (Gadar 2)

సన్నీ డియోల్, అమీషా పటేల్ నటించిన యాక్షన్ డ్రామా గద్దర్ 2 సినిమా జీ 5(ZEE 5) లో అక్టోబర్ 6 న విడుదల కానుంది.

ముంబై డైరీస్ సీజన్ 2

నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మెడికల్ త్రిల్లర్ ముంబై డైరీస్ సీజన్ 2 (Mumbai Diaries Season 2) సినిమా అమెజాన్ ప్రైమ్ (Amazon prime)వేదికగా అక్టోబర్ 6 న స్ట్రీమింగ్ కు సిద్దమవుతుంది.

మిస్టర్ ప్రెగ్నెంట్

బిగ్ బాస్ సీజన్ 4 సోహెల్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా 'ఆహా'(Aha) లో అక్టోబర్ 6 న విడుదల కానుంది.

డిస్నీ హాట్‌స్టార్‌(Disney Plus Hotstar)  

  • లోకి (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 6
  • హంటెడ్‌ మాన్షన్‌ (హలీవుడ్‌) అక్టోబరు 4

నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలయ్యే సినిమాలు

  • బెక్‌హమ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 4
  • ఖుఫియా (హిందీ) అక్టోబరు 5
  • 'ఇన్సిడియస్‌' (హాలీవుడ్‌) అక్టోబరు 6
  • 'ఫెయిర్‌ ప్లే' (హాలీవుడ్) అక్టోబరు 6
  • ఎవ్రీథింగ్‌ నౌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 5
  • లుపిన్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 5
  • 'స్ట్రాంగ్‌ గర్ల్‌ నామ్‌-సూన్‌' (కొరియన్‌) అక్టోబరు 6

Also Read: Bigg Boss 7 Rathika Rose: రతిక బ్రేక్ అప్ స్టోరీ.. రతిక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా.. ?

Advertisment
తాజా కథనాలు