This Week Theatre Releases : ఈ వారం థియేటర్ లో అదిరిపోయే చిత్రాలు.. అందులో స్టార్ కమెడియన్ సినిమా కూడా..

ఈ వారం థియేటర్ లో సందడి చేయనున్న చిత్రాలు ఇవే. మెగా హీరో వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్', స్టార్ కమీడియన్ వెన్నెల కిషోర్ 'చారి 111', శివకందుకూరి ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పూర్తి వివరాల కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
This Week Theatre Releases : ఈ వారం థియేటర్ లో అదిరిపోయే  చిత్రాలు.. అందులో స్టార్ కమెడియన్ సినిమా కూడా..

This Week Theatre Releases 2024 : గత వారం మలయాళ మెగాస్టార్ ముమ్ముట్టి(Mega Star Mammootty)  'భ్రమయుగం', యంగ్ హీరో దీపక్ సరోజ్(Deepak Saroj) నటించిన సిద్దార్థ్ రాయ్(Siddharth Roy) చిత్రాలు థియేటర్స్ లో సందడి చేశాయి. హర్రర్, రొమాంటిక్ రెండు డిఫరెంట్ జనర్స్ గా రూపొందిన ఈ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను అలరించించడానికి రాబోతున్న చిత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

ఆపరేషన్ వాలెంటైన్

మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ చిత్రం ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine). ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తిప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వంవహించారు. ప్రపంచ సుందరి మానుషీ చిల్లర(Manushi Chhillar) కథానాయికగా నటించింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా మార్చి 1న థియేటర్స్ లో సందడి చేయనుంది. సోనీ పిక్చర్స్ బ్యానర్ పై సందీప్‌ ముద్ద ఈ చిత్రాన్ని నిర్మించారు . నవదీప్, అలీరేజా, రహానీ శర్మ కీలక పాత్రలు పోషించారు.

Operation Valentine

Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్ 

చారి 111

టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం ‘చారి 111’. టీజీ కీర్తికుమార్‌ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అదితి సోనీ నిర్మించారు. వెన్నెల కిషోర్ సరసన సంయుక్త విశ్వనాథన్‌ ఫీమేల్ లీడ్ గా నటించారు. స్పై యాక్షన్‌ కామెడీ గా రూపొందిన ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మురళీశర్మ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

Chari 111

‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’

పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’. స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశీ, కార్తీక్‌ ఈ సినిమాను నిర్మించారు. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. రాశిసింగ్‌ కథానాయికగా నటించగా.. దేవి ప్రసాద్, వర్షిణి, శివనారాయణ ప్రధాన పాత్రల్లో నటించారు.

Boothaddam Bhasker Narayana

ఓటీటీ చిత్రాల లిస్ట్

  • వెడ్డింగ్‌ ఇంపాజిబుల్‌ (కొరియన్‌ డ్రామా సిరీస్‌)

ఫిబ్రవరి 26 ( అమెజాన్ ప్రైమ్)

  • ఎనీవన్‌ బట్‌ యూ (హాలీవుడ్‌ ఫిల్మ్ )

ఫిబ్రవరి 27 ( అమెజాన్ ప్రైమ్)

  • పూర్‌ థింగ్స్‌ (హాలీవుడ్‌ మూవీ )

ఫిబ్రవరి 27 ( అమెజాన్ ప్రైమ్)

  • నైట్‌ స్విమ్‌ (హిందీ ఫిల్మ్ )

మార్చి 1 ( అమెజాన్ ప్రైమ్)

  • కోడ్ 8 (హాలీవుడ్ ఫిల్మ్)

ఫిబ్రవరి 28 ( నెట్ ఫ్లిక్స్)

  • మామ్లా లీగల్‌ హై ( హిందీ)

మార్చి 1( నెట్ ఫ్లిక్స్)

  • స్పేస్‌మ్యాన్‌ (హాలీవుడ్ ఫిల్మ్ )

మార్చి 1 ( నెట్ ఫ్లిక్స్)

Also Read : Director Yashasvi : ‘నాలా ఇంకెవరూ మోసపోవద్దు’.. మ్యూజిక్ డైరెక్టర్ రధన్‍ పై వైరలవుతున్న యశస్వి కామెంట్స్

Advertisment
తాజా కథనాలు