Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ గురించి తెలియని వారుండరు. ఆయన సినిమాలకు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారో ..అంతకు మించి కుటుంబానికి విలువ ఇస్తారు. సినిమాల షూటింగ్ లేని సమయంలో ఆయన ఎక్కువగా భార్య పిల్లలతో కలిసి విదేశాలకు ట్రిప్ వేసేస్తుంటారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో అభిమానులకు తెలుసు.
తాజాగా మహేష్ యానిమల్ సినిమా (Animal Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అటు మహేష్ అభిమానులతో పాటు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఎంతైనా సూపర్ స్టార్ సూపర్ స్టారే అనిపించడని కొందరు కామెంట్లు పెడుతున్నారు.
ఈ ఈవెంట్లో పాల్గొన్న మీడియా వారు మహేష్ ని కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి ఆయన చాలా తెలివిగా సమాధానం చెప్పారు. దీంతో అందరూ అమ్మా! మహేషా నీలో ఈ కోణం కూడా ఉందా అంటూ నవ్వేస్తున్నారు. ఇంతకీ మీడియా వారు ఏం ప్రశ్నలు అడిగారంటే...ముందుగా కృష్ట గారు మిమ్మల్ని కోప్పడిన సందర్భంగా చెప్పామంటే..అలాంటివి చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ యానిమల్ సినిమాలో చూపించినంత మంచి రిలేషన్ షిప్ ని అయితే నేను చూడలేదు అని సమాధానమిచ్చాడు.
ఆ తరువాత యాంకర్ భర్తలు భార్యలను ఎలా మేనేజ్ చేయాలి అని అడగడంతో పాటు ఏమైనా టిప్స్ ఉంటే ఇవ్వమని కూడా అడిగారు. దానికి ఆయన నవ్వుతూ..భర్తలు ఎప్పుడూ నవ్వుతూ ఉంటే చాలా. ఏ సందర్భం అయినా నవ్వుతూ ఉంటే చాలు వారిని మేనేజ్ చేయడానికి ఇది ఒక్కటే దారి అని చెప్పారు.
Also Read: ఆ సినిమా చూసే రాజకీయాల్లోకి వచ్చాను.. మంత్రి మల్లారెడ్డి
అంతే అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వడంతో పాటు సూపర్ అన్సర్ అంటూ చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’. రష్మిక మందన్నా హీరోయిన్ గా, బాబీ దేవోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ డిసెంబర్ 1న విడుదలకానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మహేశ్‌బాబు (Mahesh Babu) హాజరై ప్రేక్షకులను అలరించారు.
ఈ మేరకు సినిమాను ఉద్దేశించి మాట్లాడిన మహేష్ బాబు.. సందీప్ ఫోన్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించగానే రావాలనిపించింది. ఆయన అంటే నాకు ఇష్టం. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసిందని విన్నా. నిజంగా ‘యానిమల్’ సినిమాపై మీరు ఇంతగా ఆదరణ చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. ఇంతటి ఒరిజినల్ ట్రైలర్ నేను ఇప్పటివరకు చూడలేదు. ట్రైలర్‌లోని అనిల్ కపూర్ సర్ నటన చూసి నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
బాబీ దేవోల్ యాక్టింగ్ నన్ను ఆకట్టుకుంది. రష్మిక అన్ని భాషల్లో నటిస్తోంది. నటిగా ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఈ సినిమా పెద్ద విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అన్నారు. అలాగే రణ్‌బీర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన ప్రిన్స్.. ‘రణ్‌బీర్ కు నేను పెద్ద అభిమానిని. ఆయనతో ఈ విషయం ఎప్పుడో చెప్పాను కానీ లైట్ తీసుకున్నారు. అందుకే మరోసారి చెబుతున్నా. రణ్‌బీర్ ఇండియాలో ది బెస్ట్ యాక్టర్’అంటూ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.