Stock Markets : స్టాక్ మార్కెట్‌లో దిమ్మతిరిగే ఆఫర్ ఇది!

స్టాక్ మార్కెట్ లో మరో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఐటీసీ (ITC) లిమిటెడ్ నుంచి ఐటీసీ హోటల్స్‌ సపరేట్ కాబోతోంది. దీనిపై జూన్ మొదటి వారంలో ఐటీసీ బోర్డు సభ్యులు సమావేశం కానున్నారు.

New Update
Stock Markets : స్టాక్ మార్కెట్‌లో దిమ్మతిరిగే ఆఫర్ ఇది!

Stock Markets Offer : స్టాక్ మార్కెట్(Stock Market) లో మరో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఐటీసీ(ITC) లిమిటెడ్ నుంచి ఐటీసీ హోటల్స్‌ సపరేట్ కాబోతోంది. దీనిపై జూన్ మొదటి వారంలో ఐటీసీ బోర్డు సభ్యులు సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఐటీసీ నుంచి ఐటీసీ హోటల్స్‌ విభజనపై తీసుకునే నిర్ణయం ప్రకారం ఐటీసీ హోటల్స్‌ను వేరు చేస్తారట. దీన్ని కొత్త కంపెనీగా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ చేస్తారట.

ఈ విభజన ప్రక్రియ తర్వాత ఐటీసీ హోటల్స్‌లో 40 శాతం షేర్లు మాతృ సంస్థ (ITC లిమిటెడ్‌) వద్ద ఉంటుంది. మిగిలిన 60 శాతం షేర్లు ఐటీసీ వాటాదార్ల చేతిలో ఉంటుంది. ప్రతి షేర్ హోల్డర్ కి ITC హోటల్స్ షేర్లు ఉచితంగానే ఇస్తారు. షేర్ హోల్డర్ దగ్గర 10 ITC షేర్లు ఉంటే ITC హోటల్స్‌లో ఒక షేర్‌ కేటాయిస్తారు. ఐటీసీ హోటల్స్‌ ఒక్కో షేర్‌ ముఖ విలువ ఒక రూపాయి అవుతుంది.

వాటాదార్లు, రుణదాతలు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, సెబీ(SEBI), NCLT, ఇతర నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం తర్వాత ITC హోటల్స్ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ కానున్నాయి. హాస్పిటాలిటీ పరిశ్రమలో, హోటల్స్ వ్యాపారంలో ఒక ప్రత్యేక సంస్థగా ఎదిగేందుకు పోటీ పడుతోంది ITC Hotels. దేశ వ్యాప్తంగా చూస్తే 70 సిటీల్లో 120 హోటళ్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 11,600 గదులు ఉన్నాయి.

ఈ రోజు మార్కెట్ లో ITC షేర్ ధర 444 రూపాయల రేంజ్ లో ఉంది. జనవరి నెలలో 470 రూపాయలు ఉన్న ఈ షేరు ప్రస్తుతం డిస్కౌంట్ ధరలోనే లభిస్తోంది. గత ఏడాది కాలంలో చూస్తే ఈ షేరు కేవలం 5 శాతం మాత్రమే పెరిగింది. ఐదేళ్ల కాలంలో 45 శాతం మేర పెరిగింది.

Also Read : టెక్ మహీంద్రా లాభాల్లో 40 శాతం క్షీణత..అయినా 6వేల ఉద్యోగాల రిక్రూట్‌మెంట్

Advertisment
తాజా కథనాలు