KTR Tweet:ఫార్ములా ఈ రేస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అస్సలు బాలేదని విమర్శించారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. ఇది హైదరాబాద్ అభివృద్ధి విషయంలో తిరోగమయనే అంటూ వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ రేస్‌ను రద్దు చేసిన కొద్దిసేపటికే కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా సిటీ, భారత్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతాయని సూచించారు. గతంలో కూడా చాలా మంది ఈ రేసింగ్ చూడటానికి ఆసక్తి చూపారని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ-రేసింగ్‌పై తెలంగాణ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో రద్దవడం సరైంది కాదని అన్నారు. భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఈ-ప్రిక్స్‌ని తీసుకురావడానికి మేము చాలా కృషి, సమయాన్ని వెచ్చించాము. ఇలాంటి చర్యలు నష్టం కలిగిస్తాయి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
Also read:విశాఖలో వెనక్కు వెళ్తున్న సముద్రం.. జపాన్ భూకంపమే కారణమా?
కొద్ది సేపటి క్రితమే..ఫిబ్రవర్ 10న హైదరాబాద్‌లో(Hyderabad) జరగాల్సిన ఫార్ములా ఈ రేస్‌ను రద్దు చేస్తున్నామని ఫార్ములా ఈ రేస్(Formula E Race) ఆపరేషన్స్ ప్రకటించింది. ఈ-రేస్ సీజన్ 10కు చెందిన నాలగవ రౌండ్ ఇక్కడ జరగాల్సి ఉంది. అయితే ఈ రేస్ గురించి తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) స్పందిచలేదని…దానికి తోడు మున్సిపల్ శాఖ(GHMC), హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 30వ తేదీ జరగిన ఒప్పందాన్ని మున్సిపల్ శాఖ ఉల్లంఘించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దాంతో పాటూ మున్సిపల్ శాఖకు నోటీసులు కూడా జారీ చేశామని చెబుతున్నారు. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్ఈవో చెబుతోంది.
దేశంలోనే మొదటి సారిగా లాస్ట్ ఇయర్ జనవరిలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఇ కార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ (Racing)జరిగింది. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా… హుస్సేన్ సాగర్ తీరం (Hussain Sagar) వెంబడి రేసింగ్ కార్లు పరుగులు పెట్టాయి. మన దేశంలో తొలిసారిగా జరిగిన ఈ ఇంటర్నేషనల్ ఫార్ములా – రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను చూసేందుకు పలువురు క్రీడా, సినీ, వ్యాపార ప్రముఖులు హైదరాబాద్ నగరానిలో క్యూ కట్టారు. క్రికెట్ దిగ్గజం సచిన్(Sachin Tendulkar), రామ్‌చరణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. లాస్ట్ ఇయర్ జరిగిన ప్రారంభోత్సవ రేస్ చాలా సక్సెస్ అయ్యిందని, ఆ రేస్ వల్ల ఆ ప్రాంతంలో సుమారు 84 మిలియన్ల డాలర్ల ఆర్థిక ప్రగతి జరిగిందని ఫార్ములా ఈ సీఈవో జెఫ్ డోడ్స్ తెలిపారు.