GYM Video : జిమ్ వీడియో తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న.. సీనియర్ నటి కూతురు!

ఈ పిల్లకు సోషల్ మీడియా కొట్టిన పిండి. అందాలతో యూత్‌ని బుట్టలో వేసుకోవడంతో తొలి వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు టెంప్టింగ్ ఫోజులతో రెచ్చిపోతూ కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తుంది.

New Update
GYM Video : జిమ్ వీడియో తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న.. సీనియర్ నటి కూతురు!

Surekha Vani Daughter : ఈ పిల్లకు సోషల్ మీడియా(Social Media) కొట్టిన పిండి. అందాలతో యూత్‌ని బుట్టలో వేసుకోవడంతో తొలి వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు టెంప్టింగ్ ఫోజులతో రెచ్చిపోతూ కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తుంది. దీనంతటి ఎఫెక్ట్ ఇప్పుడు ఈమెకు హీరోయిన్ ఆఫర్ వచ్చింది. రీసెంట్ గా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. పైగా ఈ పిల్ల ఓ సీనియర్ నటి కూతురు. ఈ హింట్స్ చాలనుకుంటా మీరు గుర్తుపట్టడానికి. అదేనండీ సురేఖావాణి కూతురు సుప్రిత.

సుప్రితను(Suprita) సురేఖ వాణి(Surekha Vani) డాటర్ అనేదానికన్నా సోషల్ మీడియా సెన్సేషన్ అనడం బెటర్. హీరోయిన్లు, టీవీ నటీనటులు ఏ రేంజ్ లో పాపులర్ అయ్యారో అంతకుమించి క్రేజ్ కొట్టేసింది సుప్రిత. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే జనాల్లో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది. దీనంతటికీ కారణం సామజిక మాధ్యమాలు. సుప్రిత చేసే హంగామా. నైట్ పార్టీస్, గోవా ట్రిప్స్ ఇలా ఎన్నో విషయాలను, ఫోటోలను, వీడియోలను షేర్ చేసి యూత్ పల్స్ పట్టేసిన ఈ బ్యూటీ.. తాజాగా తన వర్కౌట్ వీడియో షేర్ చేసింది. ఇందులో అమ్మడి లేలేత అందాలు చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు.

Also Read : ప్రిన్స్ తో ప్యాట్ కమ్మిన్స్‌.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

మరికొద్ది రోజుల్లో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్న సుప్రిత.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది. మరిన్ని సినిమా అవకాశాలు పట్టేయడమే లక్ష్యంగా సుప్రిత ఇలా రెచ్చిపోతుందనే టాక్ అయితే ఉంది. మొత్తానికి ఇలా సుప్రిత ఫాలోయింగ్ తో పాటు పాపులారిటీ పెరుగుతూ వస్తోంది. రీసెంట్ గానే హీరోయిన్‌గా ఛాన్స్ పట్టేసిన సుప్రిత.. బిగ్ బాస్(Bigg Boss) అమర్‌దీప్‌(Amardeep) తో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అవకాశం దొరికితే తన అందాలతో సిల్వర్ స్క్రీన్ షేక్ చేయడం పక్కా అనే హిట్స్ ఇస్తోంది ఈ యంగ్ లేడీ. ఇకపోతే సురేఖా వాణి, సుప్రితలు చేసుకునే వీకెండ్ పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్నేహితులతో కలిసి చిల్ కావడం, టైం దొరికితే చాలు గోవాకు పయనమై అక్కడి అందాలకు తమ గ్లామర్ డోస్ యాడ్ చేయడం లాంటివి చేస్తుంటారు. బ్యాంకాక్, దుబాయ్ అంటూ చెలరేగిపోతుంటారు. ఇలా ఇద్దరికీ మంచి క్రేజ్ అయితే లభించిందనే చెప్పుకోవాలి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు