Poison Dart Frog: ఈ బుల్లి కప్ప పది మందిని చంపగలదు.. దీని విలువ తెలిస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం!

ఇది భూమిపై అత్యంత ప్రమాదకరమైన జంతువులలో ఒకటిగా గుర్తింపు పొందింది.ఈ బుల్లి కప్ప పది మందిని చంపగలదు.. దీని విలువ తెలిస్తే షాక్ అవటం కాయం.అదేంటో చూసేయండి!

New Update
Poison Dart Frog: ఈ బుల్లి కప్ప పది మందిని చంపగలదు.. దీని విలువ తెలిస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం!

సాధారణంగా ఈ భూ ప్రపంచంలో అడ్వాన్స్డ్ కార్లు, టెక్నాలజీ డివైజ్‌లతో పాటు, అరుదైన వస్తువులకు, జీవులకు (Rare creatures) చాలా డిమాండ్‌ ఉంటుంది. బాగా అరుదుగా దొరికే చిన్న జీవులు సైతం ఊహించని స్థాయిలో ధరలు పలుకుతూ ఆశ్చర్యపరుస్తుంటాయి. వాటిలో ఒకటి స్టాగ్ బీటిల్ (Stag Beetle). ఇది ఒక రకమైన కీటకం. ఒక్కో బీటిల్ ధర అక్షరాలా రూ.65 లక్షల వరకు ఉంటుంది. ఇదే చాలా ఎక్కువ అనుకుంటే మరొక చిన్న జీవి దీనికి మించిన రేటు పలుకుతూ అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. అదే పాయిజన్ డార్ట్ ఫ్రాగ్ (Poison Dart Frog). ఈ చిన్న కప్ప ధర రూ.2 లక్షల వరకు ఉంటుంది.

సైజులో చిన్నదే అయినా, పాయిజన్ డార్ట్ ఫ్రాగ్ జాతి కప్పకు చాలా శక్తివంతమైన విషం ఉంటుంది. దీని విషం ఏకంగా పది మందిని చంపగలదు. అందుకే ఇది భూమిపై అత్యంత ప్రమాదకరమైన జంతువులలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇంత విషపూరితమైన ఈ కప్పలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. వీటిని స్మగ్లర్లు చాలా దేశాలకు అక్రమంగా రవాణా చేస్తుంటారు.

పాయిజన్ డార్ట్ ఫ్రాగ్స్‌కు మరో స్పెషాలిటీ ఉంది. ఈ చిన్న కప్పలు అద్భుతమైన రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. నలుపు చారలతో పసుపు లేదా నారింజ మచ్చలతో ఆకుపచ్చ వంటి ప్రకాశవంతమైన, చూడటానికి ఆహ్లాదకరమైన రంగులతో ఈ కప్పలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రియులకు నచ్చుతాయి. అందుకే ఇవి ప్రపంచంలోనే రెండవ అత్యంత విలువైన ఫ్రాగ్ జాతిగా నిలుస్తున్నాయి.

ఇంత ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి, వీటికి ఐరోపా, అమెరికా, ఆసియాలో చాలా డిమాండ్ ఉంటుంది. దీంతో కొలంబియాలో నివసించే ఈ కప్పలను అక్రమంగా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తారు. చాలా దేశాలు వీటి దిగుమతి, ఎగుమతిని నిషేధించాయి. అయితే ఈ ప్రత్యేకమైన కప్పలకు డిమాండ్ ఉంది కాబట్టి స్మగ్లర్స్‌ వాటిని అక్రమంగా అమ్మేస్తున్నారు.

పాయిజన్ డార్ట్ కప్పలకు రెండు ప్రధాన కారణాల వల్ల చాలా డిమాండ్ ఉంది. ఒకటి ఔషధ విలువ. రెండోది అందం. ఈ కప్పల విషాన్ని కొన్ని శక్తివంతమైన మందులలో ముఖ్యమైన పదార్థంగా వాడుతున్నారు. అందుకే లక్షలు పెట్టి వీటిని కొనుగోలు చేస్తారు. అలాగే, ఈ అరుదైన జంతువుల అద్భుతమైన రూపం సంపన్నులను ఆకర్షిస్తుంది. వీటిని చాలామంది పెంపుడు జంతువులుగా పెంచుకోవాలనుకుంటారు. అందుకే వీటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది.ఒకప్పుడు ఈ కప్పలు పాశ్చాత్య దేశాలలో ప్రధానంగా ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు ఇవి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయి. ఆసియా దేశాల్లో కూడా వీటి అక్రమ రవాణా జరుగుతోంది. అయితే ఈ అందమైన జీవుల వ్యాపారం చాలా ప్రమాదకరమైనది. ఈ కప్పలు విషపూరితమైనవి మాత్రమే కాదు, వాటి అక్రమ రవాణా పర్యావరణం, ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది.

Advertisment
తాజా కథనాలు