Health Tips: ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది తాము తినే ఆహారంపై, ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టడం మానేశారు. వారికి ఉన్న సమయాన్ని కాపాడుకునేందుకు.. వారి ఆయుష్షును వారే తగ్గించుకునేలా కొన్ని పనులు చేస్తున్నారు. ఇలా చేస్తున్నామని వారికీ కూడా అసలు అవగాహనా ఉండదు. అది ఎలా అంటారా? తీసుకునే ఆహార పదార్థాలు, ఉన్న ఆహార అలవాట్లు, ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం ఇలా కొన్ని అంశాలతో ప్రజలు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో విఫలం అవుతున్నారు. ముఖ్యంగా నేటి యువత అనారోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచింది. బద్దకంలో రికార్డులు బద్దలు కొడుతున్నారు నేటి యువతరం.
ALSO READ: కరోనా జేఎన్.1 వైరస్.. టెన్షన్ అక్కరలేదు
ఉదయం వీటికి దూరంగా ఉండండి బాసు..
ప్రస్తుత కాలంలో చాలా మందికి ఉదయం అల్పాహారం అదేనండోయ్ టిఫిన్ చేసే అలవాటు ఉంటుంది. అయితే, ఇది పాయింట్ కాదు టిఫిన్ లో ఎలాంటి ఆహారాలు తీసుకుంటున్నం అనేది పాయింట్. ఉదయం టిఫిన్ లో నూనెతో తయారు చేసిన ఆహారాలు తినడం ద్వారా మన ఇంటి నుంచి ఆసుపత్రి దూరంగా ఉన్న.. మీరు ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం మాత్రం పక్కా అని అంటున్నారు వైద్య నిపుణులు. నూనెతో తయారు చేసిన వంట పదార్థాలు అనగా పూరీ, బోండా, మైసూరు బజ్జి ఇలా కొన్ని ఐటమ్స్ తినడం మన ఆరోగ్యానికి అసలు మంచివి కాదు అట. ఇవి తినడం ద్వారా గుండె సమస్యలు, అసిడిటీ, కడుపులో ఉబ్బరం, జీర్ణ సమస్యలు, పేగు సమస్యలు, స్కిన్ సమస్యలు ఇలా అనేక సమస్యల భారిన పడే అవకాశం ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అలాగే ఉదయం లేవగానే టీ, కాఫీలు తాగ కుండా నీళ్లను వేడి చేసుకొని తాగడం వల్ల శరీరంలోని చెడు వ్యర్థాలు పోతాయని అంటున్నారు వైద్యులు.
ALSO READ: నేడు భారత్ బంద్… మావోయిస్టుల పిలుపు