Israel-Hamas War: వాళ్ళు మొదలు పెట్టారు.. మేము ముగిస్తాం..! ఆ ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్..!

యుద్ధాన్ని మేం మొదలు పెట్టలేదు కానీ, ముగించేది మేమే అంటూ ఇజ్రాయెల్ ప్రధాని హమాస్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. యుద్దం మొదలు పెట్టి హమాస్ చారిత్రక తప్పిదం చేసిందని వ్యాఖ్యనించారు. ఇజ్రాయెల్ ప్రతిదాడి శత్రుదేశాలకు దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని హెచ్చరిక చేశారు. హమాస్ మెరుపుదాడితో ఉక్కిరిబిక్కిరి అయిన ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగింది. ఇజ్రాయిల్, పాలస్తీన మధ్య భీకరపోరు జరుగుతోంది. గాజాపై ఇప్పటి వరకు 5 వేల బాంబులు పేల్చారు. నిన్న ఒక్క రోజే 2400 బాంబు దాడులు చేశారు. ఈ యుద్ధంలో దాదాపు1,500 మందికి పైగా ఇజ్రాయిలీలు, పాలస్తీనియన్లు చంపబడ్డారు.

New Update
Israel-Hamas War: వాళ్ళు మొదలు పెట్టారు.. మేము ముగిస్తాం..! ఆ ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్..!

Israel-Hamas War: యుద్ధాన్ని మేం మొదలు పెట్టలేదు కానీ, ముగించేది మేమే అంటూ ఇజ్రాయెల్ ప్రధాని హమాస్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. యుద్దం మొదలు పెట్టి హమాస్ చారిత్రక తప్పిదం చేసిందని వ్యాఖ్యనించారు. ఇజ్రాయెల్ ప్రతిదాడి శత్రుదేశాలకు దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని హెచ్చరిక చేశారు. హమాస్ మెరుపుదాడితో ఉక్కిరిబిక్కిరి అయిన ఇజ్రాయెల్ (Israel) ఎదురుదాడికి దిగింది. గాజాపై ఇప్పటి వరకు 5 వేల బాంబులు పేల్చారు. నిన్న ఒక్క రోజే 2400 బాంబు దాడులు చేశారు. ఈ యుద్ధంలో దాదాపు1,500 మందికి పైగా ఇజ్రాయిలీలు, పాలస్తీనియన్లు చంపబడ్డారు. కాగా, తమ భూభాగంపై తీవ్ర నష్టం కలిగించిన హమాస్‌ (Hamas)పై ఈసారి కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ క్రమంలో దాదాపు 3 లక్షల మందిని ఇజ్రాయెల్ ప్రభుత్వం సన్నద్ధం చేసింది.

తమ దేశంపై దాడి చేసి హమాస్‌(Hamas) చారిత్రక తప్పిదం చేసిందని ఇజ్రాయెల్‌ (Israel) ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) అన్నారు. యుద్ధాన్ని ఇజ్రాయెల్‌ మొదలుపెట్టలేదు కానీ.. ముగింపునిస్తుంది అంటూ హమాస్‌ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌తో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ దేశ ప్రజలను ఉద్దేశించి తాజాగా మాట్లాడారు. యుద్ధం తాము ప్రారంభించకపోయినా ముగించేది మాత్రం తామేనని హమాస్‌కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ‘‘ప్రస్తుతం దేశం యుద్ధం చేస్తోంది. దీన్ని మేం కోరుకోలేదు. కానీ, దేశాన్ని కాపాడుకోవాల్సిన స్థితిలో ఈ యుద్ధం చేయాల్సి వస్తోంది. కానీ ముగించేది మాత్రం మేమే. మా ప్రతిదాడి హమాస్‌తో పాటు ఇజ్రాయెల్ శత్రుదేశాలకు దశాబ్దాల పాటు గుర్తుండిపోతుంది. ఇజ్రాయెల్‌పై దాడితో హమాస్ చారిత్రక తప్పిదానికి పాల్పడింది’’ అంటూ నేతన్యాహూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


హమాస్ కూడా ఐసిస్ లాంటి ఉగ్ర సంస్థేనని నేతన్యాహు పేర్కొన్నారు. ప్రజలంతా కలిసికట్టుగా దాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. హింస, అనాగరికతకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి దేశం తరపునా ఇజ్రాయెల్ ఈ యుద్ధం చేస్తోందని చెప్పారు. కాగా, తమకు మద్దతు తెలిపిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు నేతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు.

ఇజ్రాయిల్, పాలస్తీన మధ్య భీకరపోరు జరుగుతోంది. వరుసగా 4రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. గాజాపై ఇప్పటి వరకు 5 వేల బాంబులు పేల్చారు. నిన్న ఒక్క రోజే 2400 బాంబు దాడులు చేశారు. ఇజ్రాయిల్‌ దాడిలో వేలాది బిల్డింగ్‌లు కుప్పకూలిపోయాయి. గాజా సిటీని భస్మం చేస్తూ రాకెట్లతో బాంబుల వర్షం కురిపిస్తున్నారు. గాజాలో ఇప్పటి వరకు దాదాపు 687 మందికి పైగా మృతి చెందారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.


గాజా అతిచిన్న సిటీ, కానీ అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం. హమాస్ ఉగ్రమూకపై ఇజ్రాయిల్‌ మెరుపుదాడి దిగింది. గాజా సిటీలో 20లక్షలకు పైగా జనాభా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో..మూడో స్థానంలో ఉన్న గాజా సిటీ..41 కిలోమీటర్ల పొడవు, 12కిలోమీటర్ల వెడల్పులో ఉంటుంది. ఇజ్రాయిల్‌ బాంబుల వర్షానికా వేలల్లో చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. 3 లక్షల మంది సైన్యంతో ఇజ్రాయిల్ గాజాను చుట్టుముట్టింది. బిల్డింగులు పేకమేడల్లా కూలిపోతున్న పరిస్ధితి కనిపిస్తోంది. ఈ భీకర దాడులతో ప్రజలు భయం..భయంగా బ్రతుకుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు