Israel Iran War Updates | ఇజ్రాయిల్ లో రక్తపు వర్షం | Israel Attack Today | Hezbolla | RTV
గాజా శరణార్థి శిబిరంపై ఇజ్రాయేల్ వైమానిక దాడి జరిపింది. ఈ దాడిలో 35 మంది చనిపోయినట్టు చెబుతున్నారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో పది మందికి గాయాలు అయినట్టు అధికారులు ప్రకటించారు.
యుద్ధాన్ని మేం మొదలు పెట్టలేదు కానీ, ముగించేది మేమే అంటూ ఇజ్రాయెల్ ప్రధాని హమాస్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. యుద్దం మొదలు పెట్టి హమాస్ చారిత్రక తప్పిదం చేసిందని వ్యాఖ్యనించారు. ఇజ్రాయెల్ ప్రతిదాడి శత్రుదేశాలకు దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని హెచ్చరిక చేశారు. హమాస్ మెరుపుదాడితో ఉక్కిరిబిక్కిరి అయిన ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగింది. ఇజ్రాయిల్, పాలస్తీన మధ్య భీకరపోరు జరుగుతోంది. గాజాపై ఇప్పటి వరకు 5 వేల బాంబులు పేల్చారు. నిన్న ఒక్క రోజే 2400 బాంబు దాడులు చేశారు. ఈ యుద్ధంలో దాదాపు1,500 మందికి పైగా ఇజ్రాయిలీలు, పాలస్తీనియన్లు చంపబడ్డారు.
ఇజ్రాయెల్‌లో అతి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూస్తే అక్కడ పరిస్ధితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్ధమవుతోంది. ఐదుగురు కుటుంబ సభ్యులున్న ఓ కుటుంబాన్ని వారింట్లోనే బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు వారి 18 ఏళ్ల కుమార్తెను కిరాతకంగా చంపేశారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు మిగతా నలుగురు ప్రాణాలు అరచేత పెట్టుకుని నేలపై కూర్చున్నారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఓ వైపు గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుంటే మరోవైపు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ లో భీభత్సం సృష్టిస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని విదేశీయులను కూడా హమాస్ విడిచిపెట్టలేదు. జెరూసలెంలో 27మంది భారతీయులు చిక్కుకున్నారు. నేపాలీలను కూడా హమాస్ ప్రజలు బందీలుగా చేసుకున్నారు. 9 మంది నేపాలీలను బందీలుగా పట్టుకున్నారు, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న ప్రజలను లక్ష్యంగా చేసుకుని హమాస్ ప్రజలు నిరంతరం దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి సంఖ్య 300 దాటిందని వైద్య అధికారులను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది.