Health Tips: కళ్లకు కూడా థైరాయిడ్‌ వస్తుందా?.. లక్షణాలు ఎలా ఉంటాయి?

థైరాయిడ్‌ ఉంటే ముందుగా కంటి వెనుక కండరాలు, కొవ్వు కణజాలాల్లో వాపు ప్రారంభం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఇది కంటి చుట్టూ ఉన్న కండరాలు, కణజాలాలకపై దాడి చేస్తుంది. థైరాయిడ్‌ను పట్టించుకోకపోతే రోగనిరోధక వ్యవస్థపై నెగెటివ్ ప్రభావం చూపుతుంది.

Health Tips: కళ్లకు కూడా థైరాయిడ్‌ వస్తుందా?.. లక్షణాలు ఎలా ఉంటాయి?
New Update

Health Tips: థైరాయిడ్‌ ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఇది పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. థైరాయిడ్‌ ఉంటే ముందుగా కంటి వెనుక కండరాలు, కొవ్వు కణజాలాల్లో వాపు ప్రారంభం అవుతుందని నిపుణులు అంటున్నారు. కళ్లలో చూసే థైరాయిడ్‌ పెరుగుతుందా లేదా అనేది తెలుసుకోవచ్చని చెబుతున్నారు.

కంటిలో కనిపించే థైరాయిడ్ లక్షణాలు:

  • ఎవరికైనా థైరాయిడ్ సమస్య ఉంటే వాళ్ల కళ్లలో తెలుసుకోవచ్చు. థైరాయిడ్‌ను పట్టించుకోకపోతే సమస్య తీవ్రం అంవుతుంది. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కంటి చుట్టూ ఉన్న కండరాలు, కణజాలాలకపై దాడి చేస్తుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల కనుబొమ్మలపై వాపు కనిపిస్తుంది. థైరాయిడ్ హార్మోన్లు అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. దీని ప్రభావం కళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది.

కళ్లపై ప్రభావం:

  • కంటి వైద్యులు చెబుతున్నదాని ప్రకారం థైరాయిడ్ అనేది గొంతులో ఉండే గ్రంథి. ఈ గ్రంథి నుంచి థైరాయిడ్ హార్మోన్ విడుదలవుతుంది. దీని సహాయంతో శరీరం చాలా పనులు చేయగలదు. థైరాయిడ్ గ్రంధి యొక్క పనితీరులో ఏదైనా సమస్య ఉంటే అది కళ్లు లేదా దాని పరిసర ప్రాంతాలను ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. కంటిలో థైరాయిడ్ అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది నేరుగా కళ్లకు హాని కలిగించదు కానీ వాటి చుట్టూ ఉన్న కణజాలాన్ని దెబ్బతీస్తుంది.

కంటి థైరాయిడ్‌ లక్షణాలు:

  • హైపర్ థైరాయిడిజం రోగుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. థైరాయిడ్ సమస్యలు లేని వారిలో కూడా కొన్నిసార్లు ఈ లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు. థైరాయిడ్ కంటి వ్యాధి అత్యంత సాధారణ లక్షణం బయటికి కళ్లు ఉబ్బినట్టు రావడం. రెండో లక్షణం కనురెప్పలు పెరగడం. దీని కారణంగా కళ్లు పెద్దవిగా కనిపించడం ప్రారంభిస్తాయి. అంతేకాకుండా కనురెప్పల వాపు, డబుల్ దృష్టి కూడా ఈ వ్యాధి లక్షణాలు. కొన్నిసార్లు కంటి చూపు కూడా బలహీనంగా మారవచ్చని నిపుణులు అంటున్నారు.

కంటి చూపు పోవచ్చు:

  • థైరాయిడ్ కంటి వ్యాధి ప్రధానంగా హైపర్ థైరాయిడ్‌లో వస్తుంటుంది. అలాంటి సమయంలో థైరాయిడ్ గ్రంథి పెద్ద పరిమాణంలో హార్మోన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. హైపర్ థైరాయిడిజం కళ్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీనిని థైరాయిడ్ ఆప్తాల్మోపతి అని కూడా పిలుస్తారు. దీని వల్ల గుండె కూడా ప్రభావితమవుతుంది. దీన్నే అరిథ్మియా అంటారు. హైపర్ థైరాయిడిజం మెదడు కణజాలం, నరాలతోపాటు మెదడును ప్రభావితం చేస్తుంది. దీని వల్ల చేతులు, కాళ్లలో జలదరింపు, తిమ్మిరి, బలహీనత, నొప్పి, మంట వంటి లక్షణాలు కనిపించవచ్చని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి :  రొమ్ము నొప్పిని లైట్‌ తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు..జాగ్రత్త

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #health-care #best-health-tips #eyes-thyroid
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe