Health Tips: పురుషుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఏదైనా క్యాన్సర్ కావచ్చు..జర భద్రం!

మగవారిలో చాలా ఎక్కువగా మూత్రాశయ క్యాన్సర్ కనిపిస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ క్యాన్సర్ ఉన్నవారికి మూత్రంలో రక్తం కనిపించడంతోపాటు మూత్ర విసర్జన సమయంలో నొప్పి, వెన్ను నొప్పి లాంటివి కనిపిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

New Update
Health Tips: పురుషుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఏదైనా క్యాన్సర్ కావచ్చు..జర భద్రం!

Health Tips: నేటి కాలంలో ఎక్కువ మంది క్యాన్సర్ సమస్య ఇబ్బంది పెడుతుంది. క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని నిపుణులు అంటున్నారు. ఎక్కువగా మహిళలు గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు ఈ మధ్య కాలంలో అధికంగా ఉన్నారు. అయితే.. డాక్టర్లు క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తించ వచ్చని చెబుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే.. పాణం కాపాడుకోవచ్చని చెబుతున్నారు. అయితే ఆడవారిలోనే క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటారు. కానీ..మగవారిలో కూడా కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. మగవారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు కొన్న విషయాలు తెలసుకుందాం.

మూత్రాశయ క్యాన్సర్:

  • మగవారిలో చాలా ఎక్కువగా మూత్రాశయ క్యాన్సర్ కనిపిస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ క్యాన్సర్ ఉన్నవారికి మూత్రంలో రక్తం కనిపించడంతోపాటు మూత్ర విసర్జన సమయంలో నొప్పి, వెన్ను నొప్పి లాంటివి కనిపిస్తాయని హెచ్చరిస్తున్నారు. అలాగే..ప్రోస్టేట్ క్యాన్సర్,స్పెర్మ్‌ను రవాణా చేసే అవయవం ప్రోస్టేట్ గ్రంథి ఇది మూత్ర విసర్జనలో ఇబ్బంది పట్టడం, మూత్ర విసర్జన అధికంగా రావడం, మూత్రంలో రక్తం పడటం, వీర్యంలో రక్తం రావటం, ఎముకల నొప్పిగా ఉండటం, అంగస్తంభన లోపం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి డాక్టర్లను సంప్రదించాలి. ఈ లక్షణాలు కనిస్తే ఇది ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలే అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఊపిరితిత్తుల, కొలొరెక్టల్ క్యాన్సర్ అవకాశం ఉంది:

  • అంతేకాకుండా.. మగవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది అంటున్నారు. ఇందులో కొలొరెక్టల్ క్యాన్సర్ ఉన్నవారికి పొత్తికడుపు నొప్పి వస్తుంది. మోషన్స్ కావడం, బరువు తగ్గడం లాంటివి కనిపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. పురుషులలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఉంటే తరుచూ బ్రెస్ట్ స్క్రీనింగ్‌లు చేయించుకుంటే మంచిదని సూచించింది. అంతేకాదు.. లివర్‌ సమస్యలు ఉంటే.. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు పేర్కొంటుంది. లివర్‌ దెబ్బతినడం వల్ల కూడా ఆండ్రోజెన్ స్థాయి తగ్గి ఈస్ట్రోజెన్‌ స్థాయిలు పెరుగుతాయట.. దీనివల్ల కూడా క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: మగవారికి మసాజ్‌ వల్ల కలిగే లాభాలు..ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు